పూజా హెగ్డే పరిచయం అవసరం లేని పేరు నటిగా కెరియర్ మొదట్లో పలు సినిమాలు సక్సెస్ కాలేకపోయినప్పటికీ అనంతరం ఈమె బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు తమిళ భాషలలో ఎంతో బిజీగా గడిపారు. ఇక ప్రస్తుతం హిందీ భాషలో కూడా సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ ఏడాది వరుస 3 డిజాస్టర్ సినిమాలు వచ్చినప్పటికీ బుట్ట బొమ్మకు అవకాశాలు ఏమాత్రం తగ్గలేదు. ఇలా పలు భాషలలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న పూజా హెగ్డే మూడు భారీ బడ్జెట్ సినిమాలు వచ్చినప్పటికీ
ఈమె తదుపరి సినిమాలకు భారీగా రెమ్యూనరేషన్ పెంచిందని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలోనే ఈ విషయం పూజా హెగ్డే వరకు వెళ్లడంతో ఈమె తన రెమ్యూనరేషన్ విషయం గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా పూజ హెగ్డే మాట్లాడుతూ అందరూ తాను రెమ్యూనరేషన్ పెంచానని అనుకుంటున్నారు నిజానికి తాను ఎలాంటి రెమ్యూనరేషన్ పెంచలేదని నిర్మాతల దగ్గర అడ్వాన్సులు కూడా తీసుకోలేదని తెలిపారు. రేమ్యూనరేషన్ కోసం నిర్మాతలను తాను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదని ఈమె తెలిపారు.
అలా రెమ్యూనరేషన్ కోసమే తాను సినిమాలలోకి వచ్చి ఉంటే ఈపాటికి ఎన్నో సినిమాలకు కమిట్ అయ్యి ఇండస్ట్రీలో బిజీగా ఉండే దానిని తెలిపారు. తాను డబ్బు సంపాదించడం కోసమే ఇండస్ట్రీలోకి రాలేదని తెలిపారు. నటిగా ముందు తనకు అవకాశం వచ్చిన పాత్ర గురించి మాత్రమే ఆలోచిస్తాను.
నాకు ఆ పాత్ర నచ్చితే తరువాత రెమ్యూనరేషన్ గురించి ఆలోచిస్తాను కానీ రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలను తాను ఎప్పుడూ ఇబ్బంది పెట్టనని,ఈ సందర్భంగా పూజ హెగ్డే తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!