టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న పూజా హెగ్డే చేతిలో ప్రస్తుతం వరుస మూవీ ఆఫర్లు ఉన్న సంగతి తెలిసిందే. తెలుగులో నెల రోజుల గ్యాప్ లో పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, రాధేశ్యామ్ సినిమాలు విడుదల కానున్నాయి. ఈ సినిమాలతో పాటు మహేష్ బాబు హీరోగా నటించబోయే ఒక సినిమాలో కూడా పూజా హెగ్డే నటిస్తున్నారని సమాచారం. తమిళంలో విజయ్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా కోసం పూజా హెగ్డే ఏకంగా 3 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.
కొన్ని రోజుల క్రితం ఈ సినిమాకు పూజా హెగ్డే 3.5 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం జరగగా ఆ ప్రచారంలో నిజం లేదని తెలుస్తోంది. తమిళంలో పూజా హెగ్డే తొలి సినిమా మూగమాడి కాగా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు. తమిళంలో సక్సెస్ లేకపోయినా ఇతర భాషల్లో పూజా హెగ్డే నటిస్తున్న సినిమాలు సక్సెస్ అవుతుండటంతో పూజా హెగ్డేకు భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడానికి కోలీవుడ్ నిర్మాతలు అంగీకరించారు. సంవత్సరం క్రితం వరకు కోటిన్నర రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్న పూజా హెగ్డే గతేడాది అక్టోబర్ లో రెమ్యునరేషన్ ను 2.5 కోట్ల రూపాయలకు పెంచారు.
కొన్ని నెలల గ్యాప్ లోనే పూజా హెగ్డే రెమ్యునరేషన్ ను మూడు కోట్లకు పెంచారు. కోలీవుడ్ లో నయనతార తరువాత భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ పూజా హెగ్డే కావడం గమనార్హం. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్టైతే మాత్రం పూజా హెగ్డే రెమ్యునరేషన్ ను మరింత పెంచే అవకాశం ఉంటుంది.