లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

‘కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి వాయించడమూ(కొట్టడమూ) తెలుసు’ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రెండు రోజుల్లో ‘వకీల్ సాబ్’ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ల జోరు తారా స్థాయికి చేరుకుంది. ఎన్ని కరోనా వేవ్ లు ఎంటరైనా ఈసారి మాత్రం పవన్ సినిమాని మిస్ చేసుకునేది లేదు అన్నట్టు..దేనిని లెక్కచెయ్యకుండా ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ‘వకీల్ సాబ్’ టీజర్,ట్రైలర్ లలో పవన్ ఫ్యాన్స్ ను కావాల్సిన ఎలివేషన్లు ఉన్నట్టు పుష్కలంగా స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. ఫైట్లు, డ్యాన్స్ లు, విలన్లకు వార్ణింగ్ లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ నే మనం ఇప్పటివరకూ చూస్తూ వచ్చాము.

అయితే లాయర్ పాత్రలో వాదించడం… ప్రత్యర్థులకు చమటలు పట్టించడంలో కూడా చాలా హీరోయిజం దాగుంటుంది. దానిని పవన్ ఎలా ప్రదర్శిస్తాడో తెలీదు కానీ.. గతంలో చాలా మంది హీరోలు లాయర్ పాత్రల్లో మంచి నటన కనపరిచారు.అలా లాయర్లుగా చేసిన హీరోలు ఎవరు? ఆ సినిమాల పేర్లు ఏమిటి? ఓ లుక్కేద్దాం రండి :

1)నందమూరి తారక రామారావు: ‘జస్టిస్ చౌదరి’ సినిమాలో జడ్జిగానే కాదు.. ‘లాయర్ విశ్వనాథ్’ చిత్రంలో లాయర్ గా కూడా మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు అదరగొట్టారు. ఎస్.డి.లాల్ ఈ చిత్రానికి దర్శకుడు.

2)అక్కినేని నాగేశ్వర రావు: ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్లో వచ్చిన ‘సుడిగుండాలు’, దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్లో వచ్చిన ‘జస్టిస్ చక్రవర్తి’ వంటి సినిమాల్లో లాయర్ గా నటించారు ఏ.ఎన్.ఆర్.

3)కృష్ణ: కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘గుండా రాజ్యం’ చిత్రంలో లాయర్ గా నటించారు సూపర్ స్టార్.

4)చిరంజీవి: ఎ.కోదండ రామిరెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ‘అభిలాష’ చిత్రంలో లాయర్ గా నటించి అలరించారు మన మెగాస్టార్.

5)వెంకటేష్: సురేష్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ధర్మచక్రం’ సినిమాలో లాయర్ గా నటించి ఆకట్టుకున్నారు విక్టరీ వెంకటేష్.

6)నాగార్జున: ఎ.కోదండ రామిరెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన ‘విక్కీ దాదా’ మరియు ‘అధిపతి’ వంటి చిత్రాల్లో లాయర్ గా నటించారు మన కింగ్.

7)మోహన్ బాబు: ఎన్.శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘యమజాతకుడు’ సినిమాలో లాయర్ గా కనిపించారు కలెక్షన్ కింగ్.

8)ఎన్టీఆర్: రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన ‘స్టూడెంట్ నెంబర్1’ చిత్రంలో లాయర్ పాత్రను పోషించాడు మన యంగ్ టైగర్.

9)రాజేంద్ర ప్రసాద్: వంశీ డైరెక్షన్లో వచ్చిన ‘చెట్టు కింద ప్లీడర్’ సినిమాలో లాయర్ గా కనిపించాడు మన నటకిరీటి.

10)సందీప్ కిషన్: జి.నాగేశ్వర రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ‘తెనాలి రామకృష్ణ బి.ఏ.బి.ఎల్’ చిత్రంలో లాయర్ గా కనిపించాడు.

11)శ్రీహరి: ఫైట్ మాస్టర్ విజయన్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘శ్రీమహాలక్ష్మీ’ చిత్రంలో లాయర్ గా నటించాడు మన రియల్ స్టార్.

12)పవన్ కళ్యాణ్: వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ లో మన పవర్ స్టార్ కూడా లాయర్ గా అలరించడానికి రెడీ అయ్యాడు.

Share.