Pooja Hegde: నా జీవితంలో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి నువ్వే: పూజ హెగ్డే

Advertisement

దక్షిణాది సినీ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నటి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఈమె సౌత్ ఇండస్ట్రీలోని సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె మదర్స్ డే సందర్భంగా తన తల్లితో కలిసి ఒక మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

ఇలా మీడియా సమావేశంలో పాల్గొన్నటువంటి ఈ తల్లి కూతుర్లు ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి ప్రేమ గౌరవాన్ని తెలియజేశారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా పూజ హెగ్డే పెళ్లి గురించి ప్రస్తావనకు వచ్చింది. ఈ క్రమంలోనే తనకు కూతురికి కాబోయే వాడు ఎలా ఉండాలో పూజ తల్లి తన మనసులో ఉన్న కోరికలను బయటపెట్టారు.పూజా హెగ్డే ఎలాంటి వ్యక్తిని ఇష్టపడుతుంది అన్న ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ పూజ హెగ్డే తనని అన్ని విధాలుగా అర్థం చేసుకునే వాడి కోసం ఎదురుచూస్తుందనీ పూజా తల్లి సమాధానం చెప్పారు.

వైవాహిక జీవితం కలకాలం నిలిచి ఉండాలంటే భార్య భర్తలు ఇద్దరు భాగస్వామ్యంగా ఉండాలి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి గౌరవించుకోవాలి. గౌరవం లేని వ్యక్తి వద్ద ఎక్కువ కాలం ఉండలేము ఆ బంధం ఎక్కువ రోజులు నిలబడదు.పూజా హెగ్డే చాలా సున్నితమైన మనసు కలది తనని ప్రతి విషయంలోనూ అర్థం చేసుకునేవాడు అయితే బాగుంటుందని తన కూతురికి కాబోయే భర్త గురించి తన తల్లికి తెలియజేశారు అయితే ఈ విషయంపై పూజ స్పందించారు.

పూజ (Pooja Hegde) తల్లి మాటలకు తను కూడా ఏకీభవిస్తూ నా జీవితంలో ఎంతో స్ఫూర్తిదాయకమైన వ్యక్తివి నువ్వే నీ కోరికలన్నీ నెరవేరాలని అనుకుంటున్నాను నువ్వు నాకోసం చేసే ప్రతి పనికి కృతజ్ఞతలు అంటూ ఈమె కూడా తన తల్లి చెప్పినటువంటి లక్షణాలు ఉన్న అబ్బాయి తనకు భర్తగా రావాలి అంటూ తన మనసులో ఉన్న కోరికను ఈ సందర్భంగా బయటపెట్టారు. ఇలా పూజా హెగ్డే తన తల్లి గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus