దువ్వాడ జగన్నాథంలో అందాలు ఆరబోసిన పూజా హెగ్డే
- June 23, 2017 / 12:48 PM ISTByFilmy Focus
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరైనోడు చిత్రం తర్వాత చేస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథమ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయి మిశ్రమ స్పందన దక్కించుంది. ఇందులో అల్లు అర్జున్ నటన, డ్యాన్స్, ఫైట్స్ తో పాటు ఎక్కువగా హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక లైలా కోసం, ముకుంద సినిమాల్లో కాలేజీ అమ్మాయిగా హోమ్లీగా కనిపించిన ఈ భామ, డీజేలో శృతిమించి అందాలు ఆరబోసిందంట. బికినీ సీన్ తో పాటు కిస్ సీన్స్ లోను యమ హాట్ గా కనిపించి యువతకి కిక్ ని ఇచ్చిందని చెబుతున్నారు. ముఖ్యంగా రెండు సాంగ్స్ లో ఆమె గ్లామర్ డోస్ బాగా పెరిగిపోయిందని అంటున్నారు.
మాస్ ఆడియన్స్ ను ఆకర్షించడానికి హరీశ్ శంకర్ పూజా హెగ్డే తో స్కిన్ షో చేయించారని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. పూజా హెగ్డే కూడా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలను పట్టేయాలని అందాలు ఆరబోసినట్లు చెప్పుకుంటున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















