బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ తెచ్చుకుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే.. వరుసగా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ.. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటూ ఇతర హీరోయిన్లు జలస్ ఫీలయ్యేలా చేస్తోంది. దళపతి విజయ్ ‘బీస్ట్’ మూవీతో కోలీవుడ్‌లోనూ కాలు పెట్టింది. గతేడాది పూజా.. ప్రభాస్ ‘రాధే శ్యామ్’, చిరు, చరణ్‌ల ‘ఆచార్య’, విజయ్ ‘బీస్ట్’ చిత్రాలతో ప్రేక్షకుల మందుకు వచ్చింది కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. బాలీవుడ్లో చేసిన ‘సర్కస్’ కూడా అటకెక్కేసింది..
ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో రెండో సారి, డైరెక్టర్ త్రివిక్రమ్‌తో మూడోసారి కలిసి పనిచేస్తున్న SSMB 28 మీదనే ఆశలు పెట్టుకుంది.. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ పక్కన ‘కిసీకా భాయ్ కిసీ కా జాన్’ లోనూ యాక్ట్ చేస్తోంది.. ఇందులో విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి బిగ్ స్టార్స్ క్యామియో చేస్తుండగా.. జగపతి బాబు విలన్‌గా కనిపించనున్నారు.
స్టార్ హీరోయిన్గా కోట్లాది రూపాయలు తీసుకునే పూజా పాప లగ్జీరియస్ లైఫ్ గురించి, ఉండే ఇంటి నుండి వాడే కార్లు, హ్యాండ్ బ్యాగ్స్ వంటి వాటి గురించిన పలు వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు పూజా హెగ్డే ధరించిన లేటెస్ట్ ఫ్యాషన్, స్టైలిష్ డిజైనింగ్‌తో స్పెషల్‌గా డిజైన్ చేసిన ఓ బ్యూటిఫుల్ లెహంగా కాస్ట్ గురించి చూద్దాం.. SEEMA GUJRAL – BURGUNDY SEQUIN LEHENGA – కాస్ట్ : రూ. 1,88,000.. అమ్మో, ఒక్క లెహంగా అంత రేటా? అని షాక్ అవుతున్నారు నెటిజన్లు..
అయితే పూజాకి బాంబోలోని బాంద్రాలో సముద్రం వైపు వ్యూ ఉండే అపార్ట్మెంట్ కాస్ట్ రూ. 6 నుండి 8 కోట్ల వరకు ఉంటుందని.. అలాగే షూటింగ్స్ కోసం హైదరాబాద్‌లో ఎక్కువగా ఉండాల్సి రావడంతో దాదాపు రూ. 5 కోట్లతో ఓ లగ్జరీ హౌస్ తీసుకుందని తెలిస్తే ఇంకా ఎక్కువ షాక్ అవుతారు..
రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!
2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్