సాహోలో ప్రభాస్ పక్కన వినిపిస్తోన్న పూజా హెగ్డే పేరు!
- July 28, 2017 / 08:55 AM ISTByFilmy Focus
బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో ఒక సీన్ కంప్లీట్ అయింది. టీజర్ కోసం ప్రభాస్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత సిటీ సెంట్రల్ లైబ్రరీలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ పై కొన్ని షాట్స్ తెరకెక్కించారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ మూవీ లో హీరోయిన్ ఎవరనేది ? ఆసక్తికరంగా మారింది. మొదట్లో కన్నడ బ్యూటీ రష్మిక మందనా నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. తర్వాత బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకునే, పరిణీతి చోప్రా పేర్లు ప్రచారంలోకి వచ్చాయి.
తాజాగా అనుష్క, పూజా హెగ్డే పేర్లు వినిపిస్తున్నాయి. అనుష్క ఇప్పటికే మూడు సినిమాల్లో జంటగా నటించింది కావున పూజా హెగ్డే ని చిత్ర బృందం ఫైనల్ చేసినట్లు తెలిసింది. దువ్వాడ జగన్నాథం తో పూజా అటు క్లాసు, మాస్ ప్రజలను పూజా ఆకర్షించింది. టాలీవుడ్ క్రేజీ భామగా పేరుతెచ్చుకుంది. ప్రభాస్ పక్కన నటించే ఛాన్స్ పట్టేసింది. ముంబైలో జరగనున్న షెడ్యూల్ లో పూజా కూడా పాల్గొననున్నట్లు సమాచారం. ఫైట్స్ కూడా చేస్తుందని టాక్. హీరోయిన్ విషయంలో అధికారిక ప్రకటన వెలువడనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















