`దేవిశ్రీ ప్ర‌సాద్` హీరోయిన్‌గా పూజా రామ‌చంద్ర‌న్‌..!!

విల‌క్ష‌ణ చిత్రాల‌ ద‌ర్శ‌కుడు శ్రీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `దేవిశ్రీప్రసాద్‘. సినిమా ప్రస్తుతం చిత్రీకరణను జరుపుకుంటుంది. ఆర్‌.ఓ.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రుద్ర‌రాజు వెంక‌ట‌రాజు, ఆక్రోష్ నిర్మాత‌లుగా ఈ చిత్రం తెర‌కెక్కుతుంది. ఈ చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ రాక్ స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ పుట్టిన‌రోజునే యాదృచ్చికంగా ప్రారంభం కావడం విశేషం. స్వామిరారా, పిజ్జా చిత్రాల్లో న‌టించి మెప్పించిన పూజా రామచంద్ర‌న్ ఈ చిత్రంలో న‌టిస్తుంది.

డిఫ‌రెంట్ పాయింట్ తో ఆడియెన్స్ ను థ్రిల్ కు గురిచేసే ఆస‌క్తిక‌ర‌మైన మ‌లుపుల‌తో సాగే క‌థాంశంతో సినిమా ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్ర‌ముఖ తారాగ‌ణం న‌టిస్తున్న ఈ చిత్రంలో స్టార్ కమెడియన్స్ లో ఒకరైన పోసాని కృష్ణమురళి సెల్ఫీరాజా అనే పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఆద్యంతం అలరించే ఆయన క్యారెక్టర్ సాగుతుంది. త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కులకు డిఫ‌రెంట్‌ ఎక్స్‌ పీరియెన్స్ ఇచ్చే మూవీగా అన్నీ హంగుల‌తో సినిమాను రూపొందిస్తున్నామ‌ని ద‌ర్శ‌కుడు శ్రీకిషోర్ అన్నారు. అయితే ఇప్పటి వరకు దేవిశ్రీప్రసాద్ చిత్రంలో టైటిల్ రోల్ పోషించే నటుడెవరనే విషయాన్ని దర్శకుడు గోప్యంగా ఉంచుతున్నారు. అసలు ఆ నటుడెవరనే విషయంపై సినీవర్గాల్లో క్యూరియాసిటీ నెలకొంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus