అందం, అభినయంతో పాటు మంచి కథలను సెలక్ట్ చేసుకోవడం, అందుకు తగ్గట్టు కష్టపడడం కూడా చిత్ర పరిశ్రమలో అవసరం. అంతేకాకుండా అదృష్టం కూడా ఉండాల్సిందే. అందం, అభినయం ఉన్నప్పటికీ అదృష్టం పూనమ్ వద్దకు రాలేకపోయింది. అందుకే ఇన్నేళ్ల సినీ కెరీర్ లో మంచి హిట్ అందుకోలేకపోయింది. మాయ జాలం, ఒక విచిత్రం, వినాయకుడు, గగనం వంటి చిత్రాల్లో నటించినప్పటికీ పూనమ్ కౌర్ కెరీర్ ఊపందుకోలేదు. అందుకే బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్న స్వర్ణఖడ్గం సీరియల్లో నటిస్తోంది. వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీరియల్ లో పూనమ్ కౌర్ ఒక రాజ్యానికి రాణిగా అలరిస్తోంది. ఇదికూడా హిట్ కాలేదని టీవీ వర్గాల వారు చెబుతున్నారు. ఇక ఆమె గురించి కనుమరుగు అయిపోతారని అనుకునేలోపున వీణ పట్టుకుని ఇలా సరస్వతీదేవిలా ప్రత్యక్షమయింది.
చేనేత చీరలో పూనమ్ నిజంగా ఆభరణాలు ధరించని సరస్వతి దేవీలా కనిపిస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతోంది. ఇంతకీ ఈ గెటప్ ఎందుకోసమని కొంతమందికి అనుమానం రాకమానదు. అసలు విషయంలోకి వెళితే తెలుగు దేశం ప్రభుత్వం పూనమ్ ని ఆంధ్రప్రదేశ్ లోని చేనేత పరిశ్రమకి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. అందుకోసమే అక్కడి పరిశ్రమని అభివృద్ధి చేయడానికి ఇలా ఫోటోలకు ఫోజులిస్తోంది. అయితే కొంతమంది పూనమ్ పై సెటైర్ వేస్తున్నారు. కృష్ణ (పవన్ కళ్యాణ్) కోసం ఎదురుచూస్తున్న మీరా భాయ్ లా ఉంది అని విమర్శిస్తున్నారు. పవన్ నాలుగో పెళ్ళికి సిద్ధమయి పోయినట్లున్నారని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.