సైరాలో కీలకరోల్ పట్టేసిన పూనమ్ కౌర్

  • August 17, 2018 / 06:36 AM IST

అందం, అభినయం ఉన్నప్పటికీ సినీ రంగంలో విజయంసాధించాలంటే అదృష్టం కూడా ఉండాలని పూనమ్ కౌర్ వంటి నటీమణులను చూస్తే అర్ధమవుతుంది. వంకలు పెట్టలేని అందం, ఆకట్టుకునే అభినయం ఆమె సొంతం. మాయ జాలం, ఒక విచిత్రం, వినాయకుడు, గగనం వంటి చిత్రాల్లో నటించినా మంచి బ్రేక్ రాలేదు. అవకాశాలు కోసం ఎదురుచూసి అలసిపోయిన ఆమె బాహుబలి నిర్మాతల్లో ఒకరైన దేవినేని ప్రసాద్ నిర్మిస్తున్న స్వర్ణఖడ్గం సీరియల్లో నటించింది. వి. సత్యనారాయణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ సీరియల్ లో పూనమ్ కౌర్ ఒక రాజ్యానికి రాణిగా అలరిస్తోంది. అందుకే అదృష్టం ఆమె తలుపుతట్టింది. సైరా లో అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి చిత్రంలో కీలకరోల్ ఆమెను వరించింది.

ఈ రోల్ ఆమె కెరీర్ ని మలుపు తిప్పుతుందని భావిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటికే ఐదు మంది హీరోయిన్స్ నటిస్తున్నారు. సైరాకి మొదటి భార్యగా నయనతార నటిస్తోంది. రెండో భార్య గా హ్యూమా ఖురేషి, మూడో భార్యగా ప్రగ్యా జైస్వాల్‌ కనిపించనున్నారు. ఇక తమన్నా ఒక పోరాట వనితగా కనిపించనుంది. అలాగే మెగా ప్రిన్సెస్ నిహారిక గిరిజన అమ్మాయిగా చిన్నరొల్ చేస్తోంది. ఈ బృందంలో పూనమ్ కౌర్ కూడా చేరింది. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus