పోసాని కృష్ణమురళి అందరికీ సుపరిచితమే. రైటర్ గా కెరీర్ ను మొదలు పెట్టిన ఆయన అనతి కాలంలోనే స్టార్ స్టేటస్ ను సంపాదించుకున్నారు. ఈయన కథలు కూడా విలక్షణంగా ఉండేవి. అంతర్లీనంగా ఓ మెసేజ్ కూడా ఉంటుంది. పవిత్ర బంధం, గోకులంలో సీత, అల్లుడా మజాకా వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఈయన పనిచేశారు. త్రివిక్రమ్, కొరటాల శివ వంటి స్టార్ డైరెక్టర్లు ఈయన శిష్యులు అన్న సంగతి ఎక్కువమందికి తెలిసుండదు.
నటుడిగా కూడా ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషిస్తూ బిజీ ఆర్టిస్ట్ గా రాణించారు పోసాని.ప్రస్తుతం రాజకీయాల్లో కూడా కూడా హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. ఇటీవల ఆయన APFDC చైర్మన్ గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో పోసాని కామెంట్స్ వివాదాస్పదమవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. వైసీపీ పార్టీకి అనుకూలంగా టీడీపీ, జనసేన పార్టీ ల పై ఈయన నెగిటివ్ కామెంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు.
తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న ఈయన.. ‘నన్ను ఓ ఫ్యామిలీ తొక్కేయాలని చూసింది’ అన్నట్టు కామెంట్స్ చేశారు. ఈ కామెంట్ వినగానే మళ్ళీ జనసేన గురించో మెగా ఫ్యామిలీ గురించో అనుకునే ప్రమాదం ఉంది. అయితే విషయం అది కాదు. పోసానికి పెళ్లి కాకముందు.. ఇతనికి వచ్చే సంబంధాలను చెడగొట్టాలని ఓ ఫ్యామిలీ చూసేదట. పోసాని బాగా చదువుకున్నాడు. కాబట్టి సినిమాల్లో ఫెయిల్ అయినా ఏదో ఒక జాబ్ చేస్తాడు అని పిల్లనివ్వడానికి వచ్చేవారట.
కానీ ఓ ఫ్యామిలీ పనిగట్టుకుని ఆ సంబంధాలను చెడగొట్టేవారని పోసాని చెప్పుకొచ్చాడు. ఆ టైంలో చాలా కోపం వచ్చినా ఏమి చేయలేని పరిస్థితి అని.. అయితే కోపంతో బ్యాగ్ లో కత్తి కూడా పెట్టుకుని తిరిగేవాడినని పోసాని తెలిపాడు.
సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?
టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?