Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ‘ఇంటిలిజెంట్‌’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నా : యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌

‘ఇంటిలిజెంట్‌’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నా : యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌

  • January 28, 2018 / 02:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘ఇంటిలిజెంట్‌’ బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నా : యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ నిర్మిస్తున్న చిత్రం ‘ఇంటిలిజెంట్‌’. టీజర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. భారీగా వ్యూస్‌ సాధిస్తూ ట్రెండింగ్‌ అవుతోంది. ‘ఇక మీదట పేదోడికి ప్లాట్‌ఫామ్‌… ధర్మాభాయ్‌డాట్‌కామ్‌’ అంటూ సాయిధరమ్‌ తేజ్‌ చెప్పే పవర్‌ఫుల్‌ డైలాగ్‌తోనే సినిమా ఏ రేంజ్‌లో వుంటుందో అర్థం అవుతోంది. సంచలన సంగీత దర్శకుడు ఎస్‌.ఎస్‌.థమన్‌ సారధ్యంలో రూపొందిన ఈ చిత్రంలోని ఫస్ట్‌సాంగ్‌ని యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ జనవరి 28 సాయంత్రం 4 గంటలకు రిలీజ్‌ చేశారు. ‘లెట్స్‌ డు’ అంటూ వచ్చే ఈ పాటని చంద్రబోస్‌ రాశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది.prabhas-about-intelligent-movie-3

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ – ”సాంగ్‌ లాంచ్‌ చెయ్యాలని వినాయక్‌గారు మొహమాటపడుతూ పిలిచారు. ఆయన ఒక మెసేజ్‌ చేస్తే చాలు ఏ ఫంక్షన్‌కైనా, ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. నా లైఫ్‌లో ‘యోగి’ సినిమాకి చేసినంత ఎంజాయ్‌ ఏ సినిమాకి చెయ్యలేదు. రాజమౌళిగారితో చెప్పాను. వినాయక్‌గారు బాగా సుఖపెట్టేస్తారు అని. ఆయన సుఖ పెట్టకూడదు. మేం ఇంకా చాలా కష్టపడాలి. తేజ్‌ ‘సాహో’ షూటింగ్‌కి వచ్చాడు. వినాయక్‌గారితో చేయడం చాలా లక్కీ అని చెప్పాను. ఈ సినిమాలో నా మోస్ట్‌ ఫేవరేట్‌ ‘చమకు చమకు ఛాం’ సాంగ్‌. చిరంజీవిగారి పాటల్లో ది బెస్ట్‌ సాంగ్‌ అది. ఆ సాంగ్‌ చిరంజీవిగారు సూపర్బ్‌గా చేశారు. తేజు ఎలా చేశాడో అని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. వినాయక్‌గారు బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌తో వస్తున్నారు. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. ఈ చిత్రం బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ అవ్వాలని కోరుకుంటున్నా” అన్నారు.prabhas-about-intelligent-movie-2

సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ – ”ప్రభాస్‌ అంటే స్నేహానికి నిలువెత్తు రూపం. హార్ట్‌ఫుల్‌గా ఫ్రెండ్స్‌ వుంటే చాలు అనుకునే మనిషి. ఇలాంటి మనిషి సినిమా ఇండస్ట్రీలో వుండటం చాలా అరుదు. నేను ఎప్పుడూ ఎవర్నీ ఏమీ అడగను. ఎవర్ని ఏ ఫంక్షన్‌కి పిలవను. సరదాగా ప్రభాస్‌కి ఫోన్‌ చేసి సాంగ్‌ రిలీజ్‌ చెయ్యాలి వస్తావా అన్నాను. ఏయ్‌ డార్లింగ్‌ ఎక్కడికి రమ్మంటావ్‌ చెప్పు. అక్కడికి వస్తా అని చెప్పాడు. నాకు చాలా ఆనందం కల్గింది. ప్రభాస్‌ ఎక్కువమందిని కలవడు. వున్నవారితో చాలా ఆత్మీయంగా వుంటాడు. చిన్న చిన్న విషయాలకు కూడా ఆనందపడుతుంటాడు. అదే ఆనందాన్ని మాకు పంచి ఇవ్వడానికి వచ్చాడు. మా టీమ్‌ తరపున ప్రభాస్‌కి కృతజ్ఞతలు. టీజర్‌లో తేజు చిరంజీవిగారిలా వున్నాడని అంటుంటే చాలా సంతోషంగా వుంది. ఈ చిత్రంలో తేజు ఇరగదీశాడు. లావణ్య ఫస్ట్‌టైమ్‌ కమర్షియల్‌ హీరోయిన్‌ క్యారెక్టర్‌లో నటించింది. ఈ సినిమా తనకి చాలా మంచి పేరు వస్తుంది. శివ ఆకుల కాంబినేషన్‌లో వచ్చిన మా సినిమాలు అన్నీ పెద్ద హిట్‌ అయ్యాయి. ఈ చిత్రాన్ని కూడా పెద్ద హిట్‌ చెయ్యాలని కోరుకుంటున్నా” అన్నారు.prabhas-about-intelligent-movie-1

సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ మాట్లాడుతూ – ”ప్రభాస్‌ అన్నను మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్‌లా ఫీలవుతాం. మా చిత్రంలోని ఫస్ట్‌ సాంగ్‌ని లాంచ్‌ చేసినందుకు ప్రభాస్‌ అన్నకు చాలా థాంక్స్‌. ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్‌ వినాయక్‌, ప్రొడ్యూసర్‌ కళ్యాణ్‌గారికి ధన్యవాదాలు. లావణ్య మంచి క్యారెక్టర్‌ చేసింది. అందరం కలిసి మంచి సినిమా చేశాం. ఫిబ్రవరి 9న సినిమా చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా” అన్నారు.prabhas-about-intelligent-movie-1

చిత్ర నిర్మాత సి.కళ్యాణ్‌ మాట్లాడుతూ – ”మా సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బేనర్‌లో నిర్మించిన ‘ఇంటిలిజెంట్‌’ చిత్రంలోని మొదటి పాటని రిలీజ్‌ చేసినయంగ్ రెబ‌ల్‌స్టార్ ప్రభాస్‌ గారికి కృతజ్ఞతలు. ఆయన మనసు ఎలాంటిదో కృష్ణంరాజుగారిని చూస్తే తెలుస్తుంది. ఆయన ఎప్పుడూ నవ్వుతూ వుంటారు. అందుకే ఆయన్ని నవ్వుల రాజు అంటుంటాం. ప్రతి ఒక్కరూ లైఫ్‌లో హ్యాపీగా, ఆనందంగా వుండాలని కోరుకునే బ్లడ్‌ వారిది. అలాంటి మంచి వ్యక్తి ప్రభాస్‌ చేతులమీదుగా చంద్రబోస్‌ రాసిన ‘లెట్స్‌ డు’ పాటని రిలీజ్‌ చేయడం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రంలో మొత్తం నాలుగు పాటలున్నాయి. ఈరోజు నుండి ప్రతి నాలుగు గంటలకొకసారి ఒక పాటని రిలీజ్‌ చేస్తాం. భాస్కరభట్ల, వరికుప్పల యాదగిరి రాసిన పాటలు కూడా బాగా వచ్చాయి. మా హీరో సాయిధరమ్‌ తేజ్‌ అన్ని పాటలకి డ్యాన్స్‌లు ఇరగదీశాడు. లావణ్య త్రిపాఠి కూడా డ్యాన్స్‌ మూవ్‌మెంట్స్‌ని చాలా టిపికల్‌గా చేసింది. ఈ సినిమాతో లావణ్యకి ఎక్కువ లవ్‌ కాల్స్‌ వస్తాయి. ఫిబ్రవరి 9న ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ అవుతుంది. ఈ సినిమా సక్సెస్‌ గురించి 10న మాట్లాడతాం. మా మీద అభిమానంతో వచ్చి మా ‘ఇంటిలిజెంట్‌’లోని ఫస్ట్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేసి మా టీమ్‌ని బ్లెస్‌ చేసిన ప్రభాస్‌గారికి మా టీమ్‌ అందరి తరపున కృతజ్ఞతలు” అన్నారు.prabhas-about-intelligent-movie

రచయిత ఆకుల శివ మాట్లాడుతూ – ”టైటిల్‌కి చాలా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. పాటలన్ని చాలా బాగున్నాయి. థమన్‌ మంచి మ్యూజిక్‌ ఇచ్చాడు. ఫిబ్రవరి 9న సినిమా రిలీజ్‌ అవుతుంది. ఖచ్చితంగా ఈ చిత్రం పెద్ద హిట్‌ అయి మా అందరికీ మంచి పేరు తెస్తుందని నమ్మకంతో వున్నాం. ఈ అవకాశం ఇచ్చిన వినాయక్‌, కళ్యాణ్‌గారికి నా థాంక్స్‌” అన్నారు.prabhas-about-intelligent-movie-5

హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ – ”ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన వినాయక్‌గారికి, కళ్యాణ్‌గారికి కృతజ్ఞతలు. మా చిత్రంలోని సాంగ్‌ రిలీజ్‌ చేయడానికి వచ్చిన ప్రభాస్‌కి నా థాంక్స్‌. ఈ సినిమా అందర్నీ అలరిస్తుంది” అన్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Intelligent Movie
  • #Prabhas

Also Read

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ‘జైలర్ 2’

related news

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

Prabhas: ఎందుకీ కన్‌ఫ్యూజన్‌ డార్లింగ్‌.. అన్నేసి ముందేసుకొని కూర్చుంటే ఎలా?

ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Prabhas Birthday Special: హిట్లు లేవు వేస్ట్ అన్నారు.. ఇప్పుడు ఎవరెస్ట్ రేంజ్ కి ఎదిగాడు

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

Tollywood: అప్‌డేట్‌లు వాయిదా వేశారు.. అంటే సినిమా రిలీజ్‌లు వాయిదా వేసినట్లేనా?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

trending news

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

RC17: రామ్‌ చరణ్‌ పక్కన బాలీవుడ్‌ హీరోయిన్‌ ఫిక్స్‌.. కానీ ఎవరు?

5 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 37 సినిమాలు విడుదల

17 hours ago
Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

Jailer 2 Collections: మొదటి వారమే 98 శాతం రికవరీ.. తెలుగులో ప్రాఫిట్స్ ఎంతో తెలుసా?

18 hours ago
ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

ఆదర్శ కుటుంబం ట్రైలర్ రివ్యూ.. నారప్ప బ్లాస్ట్ ను మిక్స్ చేస్తే

2 days ago
ఫౌజి..  ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

ఫౌజి.. ఇండియాస్ బిగ్గెస్ట్ రెబల్ సోల్జర్

2 days ago

latest news

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

Sandeep Vanga: ఈ మందు సంబరాలు ఏంటి డైరక్టర్‌ గారూ.. మొన్నలా.. నిన్నిలా.. ఎందుకిలా?

8 hours ago
Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

Rahul Sankrityan: ఆ బానిస పదాలు వదిలేయండి.. మినిమమ్‌ కామన్‌సెన్స్‌ లేకుండా తొక్కేద్దామనుకున్నారు

9 hours ago
Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

Tharun Bhascker: కోలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న తరుణ్‌ భాస్కర్‌.. ఆ డైరక్టర్‌ని రీప్లేస్‌ చేస్తూ..

24 hours ago
Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

Sri Vishnu: శ్రీవిష్ణుకి మైథాలజీ టచ్‌ ఇస్తున్న కుర్ర కామెడీ డైరక్టర్‌

1 day ago
Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

Tollywood: మరోసారి టాలీవుడ్‌లో సినిమాల పోస్ట్‌ పోన్.. నాలుగు చిన్న సినిమాలకు తలనొప్పి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version