ముంబయిలో కరోనా కేసులు పెరగుతున్న నేపథ్యంలో వరుసగా చిత్రీకరణలు నిలిపేస్తూ వస్తున్నారు. అయితే అక్కడి ప్రభుత్వం తక్కువమంది సిబ్బందితో సినిమా చిత్రీకరణ జరుపుకోవచ్చని అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే… ‘ఆదిపురుష్’ అప్డేట్ గురించి. ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయిందని ప్రభాస్ తిరిగి హైదరాబాద్ వచ్చేశాడని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయితే ప్రభాస్ రావడం కరెక్టే కానీ, సినిమా షూటింగ్ మాత్రం ఆగలేదు అంటున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన తక్కువమంది సిబ్బంది ఆప్షన్‌ను వినియోగించుకొని చిత్రబృందం సినిమా చిత్రీకరణను కొనసాగిస్తోందని తెలుస్తోంది. కీలక పాత్రధారులు లేని సన్నివేశాలను చిత్రబృందం తెరకకెక్కిస్తోందట. దీంతోపాటు సాంకేతికత ఉపయోగించుకొని తీయాల్సిన కొన్ని సన్నివేశాలను చిత్రబృందం పూర్తి చేస్తోందట. ఇటీవల దర్శకుడు ఓంరౌత్ మాట్లాడుతూ సినిమా చిత్రీకరణలో మాస్క్‌లు, శానిటైజర్లు పక్కగా వాడుతున్నామని, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నమాని చెప్పాడు. దాని బట్టే సినిమా షూటింగ్ కొనసాగుతోందని అంటున్నారు. మరోవైపు కరోనా పరిస్థితుల వల్ల వచ్చిన గ్యాప్‌తో హీరో ప్రభాస్,
విలన్ సైఫ్ అలీ ఖాన్ బాడీని ఫిట్ చేసుకునే పనిలో ఉన్నారట. సినిమా కోసం వీరిద్దరూ మేకోవర్ పనులు చేస్తున్నారట. దీని గురించి ఓం రౌత్ చాలా ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు. ఇప్పటివరకు ఎవరూ చూడని ప్రభాస్, సైఫ్ అలీఖాన్‌ను ఈ సినిమాలో చూపిస్తాం. ప్రస్తుతం వారిద్దరూ వండర్ఫుల్ మేకోవర్ పనుల్లో ఉన్నాడు అని చెప్పుకొచ్చాడు. ఏంటో ఆ స్పెషల్ తెలియాలంటే కరోనా కనికరించి సినిమా షూటింగ్ త్వరగా అయ్యి, సినిమా రిలీజ్ అవ్వాలి.