బాహుబలి కంక్లూజన్ షూటింగ్ పూర్తి కావడంతో ప్రభాస్ పెళ్లి విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఈ ప్రశ్నను రెబల్ స్టార్ కృష్ణం రాజు ని అడగగా ఆయన ఆసక్తికర సంగతులు వెల్లడించారు. ప్రభాస్ తన తల్లి శివ కుమారి చూసిన సంబంధానికి ఒకే చిప్పినట్లు వెల్లడించారు. గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయినే వివాహమాడనున్నట్లు వివరించారు. అయితే డార్లింగ్ కి సతీమణి కాబోయే ఆమె పేరు చెప్పడానికి కృష్ణం రాజు నిరాకరించారు. ప్రస్తుతం ప్రభాస్ తర్వాతి సినిమా కోసం బరువు తగ్గే పనిలో ఉన్నారు.
సుజీత్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. ఆ చిత్రం మొదలయ్యేలోపున కళ్యాణం ఉంటుందా? అని విలేకరులు రెబల్ స్టార్ ని ప్రశ్నించగా… హడావుడిగా పెళ్లి చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాతే పెళ్లి పనులు మొదలవుతాయని చెప్పారు. సో ప్రభాస్ వివాహం ఏప్రిల్ తర్వాతే ఉంటుందని కృష్ణం రాజు మాటల్లో స్పష్టంగా తెలిసింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.