బాహుబలి తర్వాత మళ్ళీ ఇన్నాళ్లకు వెళ్తున్నారు

ఒక హీరో.. ఒక హీరోయిన్ తో రెండు సినిమాలు చేశాడంటే చాలా.. వారిద్దరి మధ్య ఏదో ఉందని వార్తలొచ్చే తరుణమిది. అందుకే.. ఈమధ్యకాలంలో ప్రభాస్-అనుష్కల మీద వచ్చినన్ని వార్తలు ఇంకెవ్వరి మీదా రాలేదు. ఈ ఇద్దరు కలిసి కనిపిస్తే చాలు “ఎంత బాగున్నారో” అని మురిసిపోయేవాళ్లు కొందరైతే.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అడిగేవాళ్లు ఇంకొందరు. అయితే.. “బాహుబలి” విడుదల తర్వాత వీళ్ళు మళ్ళీ కలిసి కనిపించలేదు. అయినప్పటికీ.. ప్రభాస్ ను అనుష్క గురించి అడిగినప్పుడల్లా “ఆమె నాకు మంచి స్నేహితురాలు మాత్రమే” అని చెప్పేవాడు ప్రభాస్.

మళ్ళీ చాన్నాళ్ల తర్వాత ప్రభాస్-అనుష్క కలిసి కనిపించడానికి సిద్ధమవుతున్నారు. “బాహుబలి” అనంతరం జపాన్ లో ప్రభాస్ కి మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. దాంతో అతడి మునుపటి చిత్రాలైన “మిర్చి”ని జపాన్ లో విడుదల చేస్తున్నారు. మార్చి 2న “మిర్చి” జపాన్ వెర్షన్ స్పెషల్ షోను జపాన్ లో నిర్వహించనున్నారు. ఆ సినిమాలోనూ ప్రభాస్, అనుష్క జంటగా నటించడంతో ప్రీమియర్ కి వారిద్దరినీ ఆహ్వానించారట. సో, మళ్ళీ మార్చి 2న వాళ్ళిద్దరూ కలిసి కనిపించనున్నారన్నమాట. ఇక వీరిద్దరి ఫ్యాన్స్ కి పండగే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus