హైదరాబాద్ కి ప్రభాస్ ఎప్పుడొస్తున్నారంటే ?
- May 31, 2017 / 01:58 PM ISTByFilmy Focus
ఐదేళ్ల పాటు యజ్ఞంలా చేసిన బాహుబలి చిత్ర షూటింగ్, రిలీజ్ పూర్తి కావడంతో ప్రభాస్ విశ్రాంతి తీసుకోవడానికి అమెరికాకు వెళ్లారు. దాదాపు ఇరవై రోజులుగా అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ త్వరలోనే ముగియనుందని సమాచారం. బాహుబలి తర్వాత ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేయబోతున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు మూడు భాషల్లో నిర్మిస్తున్న ఈ చిత్రం టీజర్ గత నెల రిలీజ్ అయి అభిమానులను అలరించింది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కోసం సుజీత్ మొత్తం సిద్ధం చేశారు.
ప్రభాస్ ఇండియాకి రాగానే ముంబై లో మొదటి షెడ్యూల్ మొదలుపెట్టనున్నారు. ఆ సమయం ఆసన్నమైంది. ప్రభాస్ జూన్ 5 హైదరాబాద్ కి రానున్నట్లు తెలిసింది. అనంతరం రెండు రోజుల పాటు రెస్ట్ తీసుకొని సెట్స్ మీదకు వెళ్లనున్నారు. బాలీవుడ్, హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్న సాహో పై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















