Prabhas: కల్కి సినిమాతో మరో మెట్టు ఎదిగిన ప్రభాస్.. ఏం జరిగిందంటే?

  • July 4, 2024 / 04:11 PM IST

ప్రభాస్  (Prabhas) , నాగ్ అశ్విన్ (Nag Ashwin) కాంబినేషన్ లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD)  సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం. స్టార్ హీరో ప్రభాస్ రజనీకాంత్, విజయ్ రికార్డులను బ్రేక్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లను సాధించిన సినిమాలలో జైలర్, లియో ఉండగా ఆ రికార్డ్ లను కల్కి మూవీ బ్రేక్ చేయడం గమనార్హం.

కల్కి సినిమాతో ప్రభాస్ మరో మెట్టు ఎదిగాడంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కల్కి మూవీ ఫుల్ రన్ లో మరిన్ని రికార్డులను ఖాతాలో వేసుకునే అవకాశం అయితే ఉంది. నార్త్ అమెరికాలో కల్కి మూవీ సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. కల్కి మూవీ సాధిస్తున్న కలెక్షన్లు చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకవుతున్నాయి. సెలబ్రిటీలతో పాటు సామాన్యులు సైతం కల్కి సినిమాను ప్రశంసిస్తున్నారు.

కల్కి 2898 ఏడీ సినిమా గురించి బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి సైతం పాజిటివ్ కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కల్కి 2898 ఏడీ సీక్వెల్ త్వరలో మొదలుకానుందని సమాచారం అందుతోంది. ప్రభాస్ ప్రతి సినిమాలో తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కల్కి సక్సెస్ తో దీపికకు తెలుగులో మూవీ ఆఫర్లు పెరిగే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు.

ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. అదే సమయంలో ప్రభాస్ సినిమాలు బిజినెస్ పరంగా కూడా అదరగొడుతున్నాయి. ప్రభాస్ తన సినిమాలకు పెద్దగా ప్రమోషన్స్ చేయకుండానే విజయాలను సొంతం చేసుకుంటున్నారు. ప్రభాస్ 100 నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. కల్కి సలార్ కలెక్షన్ల రికార్డ్ ను బ్రేక్ చేయడం హాట్ టాపిక్ అవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus