Varalaxmi Sarathkumar: గ్రాండ్‌గా వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రీ-వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. వైరల్ అవుతున్న ఫోటోలు!

టాలీవుడ్‌లో సరైన లేడీ విలన్‌ అంటే మొన్నటివరకు దొరకడం చాలా కష్టం. అయితే అదంతా వరలక్ష్మి శరత్‌ కుమార్‌ విలన్‌గా మారేంతవరకే. ఆమె ఎప్పుడైతే ప్రతినాయిక పాత్రలకు సిద్ధమైందో అప్పుడే ఆ కొరత తీరిపోయింది. అలా అని అన్నీ అలాంటి పాత్రలే చేస్తోందని కాదు… సహాయ నటి పాత్రలు, సోదరి పాత్రలు, కీలక పాత్రలు చేసి మెప్పిస్తోంది.

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ముంబైకి చెందిన ఆర్ట్‌ గ్యాలరీ నిర్వాహకుడు నికోలై సచ్‌దేవ్‌ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. మార్చి 1 న వీరి ఎంగేజ్మెంట్ ముంబైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. గత 14 ఏళ్లుగా వీరి మధ్య పరిచయం ఉంది. అది స్నేహంగా ఆ తర్వాత ప్రేమగా మారడంతో వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారు. వీరి ఎంగేజ్మెంట్ పిక్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అయ్యాయి.

ఇప్పటికే ఆమె వెడ్డింగ్ కార్డుని టాలీవుడ్ స్టార్స్ అయినటువంటి బాలకృష్ణ,అల్లు అర్జున్,అల్లు అరవింద్ వంటి వారికి అందజేసిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌ సెలబ్రిటీస్, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus