Jani Master: వైరల్ అవుతున్న జానీ మాస్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ కొరియోగ్రాఫర్లలో జానీ మాస్టర్ (Jani Master) ఒకరనే సంగతి తెలిసిందే. జానీ మాస్టర్ తాజాగా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. సరైన సమయంలో సహాయం చేస్తే దేవుడు అంటారని నా బర్త్ డే సందర్భంగా చరణ్ (Ram Charan) అన్న వాళ్ల ఇంటికి పిలిచారని జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. వారికి నా మీదున్న ప్రేమకు చాలా సంతోషించానని జానీ మాస్టర్ వెల్లడించారు. అక్కడికి వెళ్లిన తర్వాత చరణ్ దంపతులు ఇచ్చిన మాటతో నా సంతోషం వెయ్యి రెట్లు పెరిగిందని జానీ మాస్టర్ తెలిపారు.

నేను గతంలో అడిగిన సాయాన్ని వాళ్లు గుర్తుంచుకున్నారని చరణ్ ఉపాసన గురించి జానీ మాస్టర్ చెప్పుకొచ్చారు. మా డ్యాన్సర్స్ యూనియన్ లో ఉన్న 500కు పైగా కుటుంబాలకు హెల్త్ ఇన్సూరెన్స్ అందేలా అండగా ఉంటామని చెప్పారని జానీ మాస్టర్ పేర్కొన్నారు. అడిగిన సహాయాన్ని గుర్తుంచుకుని ఇచ్చిన మాటకు విలువిస్తూ అన్ని కుటుంబాలకు చేరదీయడం సామాన్యమైన విషయం కాదని ఆయన చెప్పుకొచ్చారు.

మా అందరి మనసులు కృతజ్ఞతతో నిండిపోయాయని మా అందరి తరపున మీకు ధన్యవాదాలు తెలుపుతున్నానని జానీ మాస్టర్ కామెంట్లు చేశారు. మీలాంటి వారితో కలిసి పని చేయడం లక్ గా భావిస్తున్నానని జానీ మాస్టర్ పేర్కొన్నారు. చరణ్ దంపతులతో దిగిన ఫోటోను జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడం జరిగింది. చరణ్ దంపతుల మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

చరణ్ ఉపాసన తాము చేసిన సేవా కార్యక్రమాలతో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చరణ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. చరణ్ బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండగా మాస్, క్లాస్ అనే తేడాల్లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథలకు చరణ్ ఓటు వేస్తున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus