Prabhas: ‘ఓజి’ లో నిజంగానే ప్రభాస్ ఉన్నాడా?

స్టార్ హీరోకి సంబంధించి కొత్త ప్రాజెక్టు అనౌన్స్ అయ్యింది అంటే చాలు… దానికి సంబంధించి చాలా గాసిప్స్ వినిపిస్తూ ఉంటాయి. నటీనటులు, పారితోషికాలు, ఫస్ట్ లుక్, ఫస్ట్ గ్లింప్స్ అంటూ ఎన్నో వార్తలు పుట్టుకొస్తూ ఉంటాయి. వాటిలో ఒక 40 శాతం నిజం ఉండే అవకాశం కూడా ఉంది. అయితే 60 శాతం ఊహాగానాలే ఉంటాయి. ఇది రియాలిటీ. ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం.

Prabhas in OG

పవన్ కళ్యాణ్ ‘ఓజి’ పై భారీ అంచనాలు ఉన్నాయి. సుజిత్ ఈ సినిమాకు దర్శకుడు. ‘రన్ రాజా రన్’ ‘సాహో’ వంటి క్రేజీ సినిమాలు డైరెక్ట్ చేశాడు సుజిత్. ఇక ‘ఓజి’ సినిమాని డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. గ్లింప్స్ తోనే ఈ సినిమాకి కావాల్సినంత బజ్ ఏర్పడింది. ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటి హంగామాలు చేయకపోయినా.. భారీ ఓపెనింగ్స్ నమోదవ్వడం గ్యారంటీ అనే నమ్మకాన్ని మేకర్స్ కు ఇచ్చింది గ్లింప్స్.

ఇదిలా ఉంటే… ‘ఓజి’ లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా నటించాడు అనేది చాలా కాలంగా మీడియాలో నలుగుతూన్న వార్త. కానీ దానిపై ఎటువంటి క్లారిటీ లేకపోవడంతో..’అది వట్టి గాసిప్’ అని అంతా అనుకున్నారు.

కానీ ‘ఓజి’ లో ప్రభాస్ కూడా నటించాడని చిన్న కేమియో ఇచ్చినట్టు ఇన్సైడ్ టాక్ బలంగా వినిపిస్తోంది. సుజిత్ గత చిత్రం ప్రభాస్ తోనే చేశాడు. ప్రభాస్ కి సుజిత్ పై నమ్మకం ఎక్కువ. అలాగే ప్రభాస్ స్నేహితులైన ‘యూవీ క్రియేషన్స్’ వారికి కూడా సుజిత్ బెస్ట్ ఫ్రెండ్. సో తన సినిమాలో కేమియో ఇవ్వమని సుజిత్ కోరితే ప్రభాస్ నో చెప్పే రకం కాదు. కాకపోతే ‘ప్రభాస్ ని ‘ఓజి’ లో సుజిత్ ఎలా ఇరికించి ఉంటాడు?’ అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

‘సాహో’ పాత్రని ‘ఓజి’ లో ఇరికించడం అనేది లాజికల్ గా వర్కౌట్ కాదు. ఎందుకంటే ‘ఓజి’ అనేది పీరియాడిక్ మూవీ.90 లలో ఆ సినిమా కథ నడుస్తుంది. కానీ ‘సాహో’ పాత్ర 2019 టైం లైన్లో నడుస్తుంది. సో దీనికి సమాధానం దొరకాలంటే.. మరో 9 రోజులు వెయిట్ చేయాల్సిందే.

రంగమ్మత్త వింత ఫోజులు.. హాట్ టాపిక్ అయిన అనసూయ లేటెస్ట్ ఫోటోలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus