టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభాస్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతుండగా ప్రభాస్ ను అభిమానులు డార్లింగ్ అని పిలుస్తారనే సంగతి తెలిసిందే. ప్రభాస్ సైతం తనకు ఇష్టమైన వాళ్లను డార్లింగ్ అని పిలవడానికి ఇష్టపడతారు. అయితే సలార్ మూవీకి సంబంధించిన ఇంటర్వ్యూలో శృతి హాసన్ రెబల్ స్టార్ అని ఎందుకు పిలుస్తారని ప్రభాస్ ను ప్రశ్నించారు. ప్రభాస్ ఆ ప్రశ్న గురించి స్పందిస్తూ మా పెదనాన్న రెబల్ స్టార్ కాబట్టి నన్ను రెబల్ స్టార్ అని పిలుస్తారని ఆయన కామెంట్లు చేశారు.
శృతి హాసన్ మాట్లాడుతూ ప్రభాస్ ను కలిసిన వారం రోజుల్లోనే ఆయనను డార్లింగ్ అని ఎందుకు పిలుస్తారో అర్థమైందని పేర్కొన్నారు. ప్రభాస్, శృతి హాసన్ కాంబినేషన్ లో మరికొన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రభాస్, శృతి కాంబో మూవీ సలార్2 షూట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది. వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.
ప్రభాస్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లకు ప్రాధాన్యత ఇస్తుండగా స్క్రిప్ట్స్ విషయంలో ప్రభాస్ మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభాస్ ఇతర భాషల ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాల్సి ఉంది. ప్రభాస్ తో సినిమాలు చేయాలని చాలామంది దర్శకనిర్మాతలు కలలు కంటున్నారు. ప్రభాస్ అద్భుతమైన కాన్సెప్ట్ లను ఎంచుకుంటే కెరీర్ పరంగా మరిన్ని భారీ విజయాలు సొంతమయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
ప్రభాస్ (Prabhas) త్వరలో పెళ్లికి సంబంధించిన తీపికబురును త్వరలో చెబుతారని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ప్రభాస్ మార్కెట్ అంతకంతకూ పెరుగుతోంది. ప్రభాస్ కు ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతుండటం గమనార్హం.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!