యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ‘ఛత్రపతి’ (Chatrapathi) తర్వాత సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న రోజులవి. ఆ తర్వాత ‘యోగి’ (Yogi) ‘బుజ్జిగాడు’ ((Bujjigadu) ‘బిల్లా’ (Billa) వంటి యావరేజ్ సినిమాలు వచ్చినా.. అవి అభిమానులను సంతృప్తిపరచలేదు. అయితే 2010 లో ఎ.కరుణాకరన్ (A. Karunakaran) దర్శకత్వంలో చేసిన ‘డార్లింగ్’ (Darling) సినిమా రిలీజ్ అయ్యింది. 2010వ సంవత్సరం ఏప్రిల్ 23న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ‘ఛత్రపతి’ తరువాత ఓ హిట్టు కోసం ప్రభాస్ మరియు అతని అభిమానులు ఎదురు చూస్తున్న రోజులవి.
మొదట ఈ సినిమా పై ఎటువంటి అంచనాలు లేవు. కానీ మొదటి షోతోనే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను రాబట్టుకుంది. ఫుల్ రన్లో క్లీన్ హిట్ గా నిలిచింది. అయితే నేటితో 14 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా ఫుల్ రన్లో ఎంత కలెక్ట్ చేసిందో ఒక లుక్కేద్దాం రండి :
నైజాం | 6.3 cr |
సీడెడ్ | 2.21 cr |
ఉత్తరాంధ్ర | 3.65 cr |
ఈస్ట్ | 2.14 cr |
వెస్ట్ | 2.65 cr |
గుంటూరు | 2.06 cr |
కృష్ణా | 2.41 cr |
నెల్లూరు | 1.02 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 22.44 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.47 cr |
టోటల్ వరల్డ్ వైడ్ | 22.91 cr |
‘డార్లింగ్’ చిత్రం బడ్జెట్ రూ.18 కోట్లు. థియేట్రికల్ పరంగా రూ.16.8 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. అయితే సమ్మర్ సీజన్ ను బాగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా ఫైనల్ గా రూ.22.91 కోట్ల షేర్ ను రాబట్టి…రూ.6.11 కోట్ల ప్రాఫిట్స్ తో క్లీన్ హిట్ గా నిలిచింది.