Prabhas: సలార్ అప్డేట్ కోసం సూసైడ్ లెటర్ రాసిన అభిమాని.. వైరల్ అవుతున్న సూసైడ్ లెటర్!

సాధారణంగా తమ అభిమాన హీరో సినిమా తెరకెక్కుతోంది అంటేనే ఆ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తారు. ఈ విధంగా సినిమా నుంచి తరచూ అప్డేట్ విడుదల చేస్తూ మేకర్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచుతూ ఉంటారు. అయితే తమ అభిమాన హీరోకి సంబంధించిన సినిమా గురించి అప్డేట్ లేకపోతే అభిమానులు ఏకంగా మేకర్స్ ను బెదిరించే స్థాయికి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రభాస్ హీరోగా నటిస్తున్న సలార్ సినిమా అప్డేట్ కోసం ఏకంగా ఒక అభిమాని మేకర్స్ ను బ్లాక్ మెయిల్ చేశారు.

గతంలో ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఈ విధంగా సూసైడ్ లెటర్ రాయడం గమనార్హం. తాజాగా మరోసారి సలార్ సినిమా కోసం ఓ అభిమాని సూసైడ్ లెటర్ రాయడంతో ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటివరకు సలార్ సినిమాకి సంబంధించిన ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో ఆందోళన చెందిన అభిమాని ఏకంగా సూసైడ్ లెటర్ రాశారు. ఈ విధంగా తమ అభిమాన హీరో సినిమా అప్డేట్ విడుదల చేయకపోతే తాను సూసైడ్ చేసుకుంటానని హెచ్చరిస్తూ సూసైడ్ లెటర్ రాసి పోస్ట్ చేశారు.

ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే అభిమాని సూసైడ్ లెటర్ రాస్తూ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూసి చూసి అసంతృప్తి చెందాను.ఈ నెలలో సలార్ అప్డేట్ ఇవ్వకపోతే కచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటానని పేర్కొన్నాడు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటోంది.

దాదాపు 35 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అప్డేట్ రాకపోవడంతో అభిమానులు ఇలా మేకర్స్ ను బెదిరిస్తున్నారు.మరి ఇప్పటికైనా ఈ సినిమా నుంచి అప్డేట్ వదులుతారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది మొత్తానికి ఈ సూసైడ్ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus