ఏఎన్నార్‌తో ప్రభాస్ తండ్రి సూర్య నారాయణ రాజు.. వైరల్ అవుతున్న ఈ రేర్ ఫోటో ఎప్పటిదంటే..?

  • February 17, 2023 / 11:23 AM IST

సోషల్ మీడియాలో సెలబ్రిటీల చిన్నప్పటి పిక్స్, రేర్ ఫోటోస్, అన్‌సీన్ ఇమేజెస్, వీడియోస్ లాంటివి బాగా వైరల్ అవుతుంటాయి.. ఇప్పుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడు, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తండ్రి ఉప్పలపాటి సూర్య నారయణ రాజు, అక్కినేని నాగేశ్వర రావుతో కలిసి ఉన్న పిక్ ఒకటి వైరల్ అవుతోంది.. కృష్ణంరాజుని హీరోగా పెట్టి.. గోపికృష్ణా మూవీస్ అనే బ్యానర్ స్థాపించి పలు సూపర్ హిట్ సినిమాలు నిర్మించి .. ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా పేరు తెచ్చుకున్నారు..

‘భక్తకన్నప్ప’ వంటి క్లాసిక్, ‘అమరదీపం’, ‘మనవూరి పాండవులు’, ‘త్రిశూలం’, ‘బొబ్బిలి బ్రహ్మన్న’, ‘తాండ్ర పాపారాయుడు’ వంటి సంచలనాత్మక చిత్రాలు తీశారు.. కృష్ణం రాజు, మురళీ మోహన్, జయసుధ ప్రధాన తారాగణంగా.. సూర్య నారాయణ రాజు నిర్మించిన ‘అమరదీపం’ ఘన విజయం సాధించింది.. ఈ చిత్రం 100 రోజుల వేడుకకు నటసామ్రాట్ ఏఎన్నార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు..

ఆయన చేతుల మీదుగా నిర్మాత సూర్య నారాయణ రాజు షీల్డ్ అందుకుంటున్నప్పటి ఫోటో ఇది.. ఈ పిక్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్, నెటిజన్లు.. ‘‘ప్రభాస్ అచ్చం వాళ్ల నాన్న గారి లానే ఉన్నాడు’’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus