ప్రభాస్ ఎమోషనల్ అవ్వడానికి కారణం అదే..!

  • August 19, 2019 / 05:49 PM IST

‘బాహుబలి 2’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న ‘సాహో’ చిత్రం కోసం ఇండియా వైడ్ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆగష్టు 30 న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్ల జోరు పెంచారు చిత్ర యూనిట్ సభ్యులు. ఇందులో భాగంగా… ఆదివారం నాడు రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు వేల సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఇంతమంది జనం తనని చూడడానికి రావడం చూసి ప్రభాస్ భావోద్వేగానికి లోనయ్యాడు.

రాజమౌళి మాట్లాడుతుండగా కాస్త ఎమోషనల్ అయిన ప్రభాస్… తన పెదనాన్న కృష్ణంరాజు మాట్లాడుతున్నప్పుడు మాత్రం కంటతడి పెట్టేసుకున్నాడు. ” ‘సాహో’ చిత్రం కోసం ప్రభాస్ పడిన కష్టం తనకి తెలుసని…. కచ్చితంగా ఆ కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని చెప్పుకొచ్చారు కృష్ణంరాజు. ఈ చిత్రం హిట్టయ్యి ఇంటర్నేషనల్ స్టార్ గా ప్రభాస్ అవ్వాలని కోరుకుంటున్నట్టు’ చెప్పడంతో ప్రభాస్ ఇలా కన్నీళ్ళు పెట్టుకున్నట్టు స్పష్టమవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus