ఇంగ్లీష్ లేదా హిందీ భాషల్లో వచ్చే స్పై థ్రిల్లర్స్, బాండ్ మూవీస్ చూసి ఇలాంటి సినిమాలు తెలుగులో ఎందుకురావు అని ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు అనుకుంటుంటాడు. ఈ లోటు తీర్చడానికే సన్నద్ధమవుతున్నాడు మన రెబల్ స్టార్ ప్రభాస్. “బాహుబలి”తో అంతర్జాతీయ స్థాయి మార్కెట్ ను కైవసం చేసుకొన్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత నటిస్తున్న “సాహో” మేకింగ్ టీజర్ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్ చూస్తున్నప్పుడే ఇది ఒక స్పై థ్రిల్లర్ అనే విషయం అందరికీ అర్ధమైంది. అయితే.. ఇందులో ఎవరికీ తెలియని విషయం ఏంటంటే “సాహో”లో ప్రభాస్ ఇండియన్ ఇంటిలిజెన్స్ ఏజెంట్ గా కనిపించనున్నాడట.
ఈ విషయం బయటకి రావడంతో ఇప్పటివరకు సినిమా మీద ఉన్న అంచనాలు ఒక్కసారిగా అమాంతం పెరిగిపోయాయి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం బడ్జెట్ ఇప్పటికీ 150 కోట్లు దాటిపోయింది. ప్రస్తుతం ప్రభాస్ కి ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని యువీ క్రియేషన్స్ కూడా బడ్జెట్ పరిమితుల గురించి పట్టించుకోకుండా ఖర్చు పెడుతున్నారు.