బాహుబలి కంక్లూజన్ తెలుగులో కంటే హిందీలో రెండు రెట్లు ఎక్కువగా కలక్షన్స్ రాబట్టింది. అయితే అందులో ప్రభాస్ సొంత వాయిస్ లేదు. వేరే వాళ్ళు డబ్బింగ్ చెప్పారు. అయినా ప్రభాస్ కి విపరీతంగా అభిమానులు ఏర్పడ్డారు. ఈ సారి ఎలాగైనా వారికి సొంత వాయిస్ ని వినిపించాలని ఫిక్స్ అయ్యారు. అందుకే హిందీ నేర్చుకుంటున్నారు. ఉత్తరాది వ్యక్తి మాట్లాడినట్టుగా భాష, యాసపై పట్టు సాధించడానికి సాధన చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ సుజీత్ దర్శకత్వంలో సాహో మూవీ చేస్తున్నారు. దీనిని ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషలో తెరకెక్కిస్తున్నారు.
యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు 150 కోట్లతో నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీలో మొదలయింది. అక్కడ ప్రభాస్ లేకుండా కొన్ని షాట్స్ తీసుకున్నారు. నెక్స్ట్ సుజీత్ బృందం రామోజీ ఫిలింసిటీకి షిఫ్ట్ కానుంది. అక్కడి షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ కానున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.