టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌తో పాటు నటసింహ నందమూరి బాలకృష్ణ మరియు మ్యాచో స్టార్ గోపిచంద్ అభిమానులు, తెలుగు ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది.. ఫస్ట్ ఎపిసోడ్‌తో అంచనాలను అమాంతం పెంచేయడమే కాక వాటిని అందుకోవడంలో సక్సెస్ అయిన ‘అన్‌స్టాపబుల్’ టీం.. రీసెంట్‌గా ‘బాహుబలి ఎపిసోడ్ పార్ట్ -2’ ప్రోమో రిలీజ్ చేశారు. ఫస్ట్ ఎపిసోడ్‌లో ప్రభాస్ అంత సింపుల్‌గా స్మైల్‌తో కనిపించడం అందరికీ సంతోషంగా అనిపించింది..
ఫ్రెండ్ గోపిచంద్‌తో అల్లరి, రామ్ చరణ్‌తో ఫోన్‌లో కామెడీ, బాలయ్యతో మర్యాదగా నడుచుకున్న విధానం, బాలయ్య చిక్కు ప్రశ్నలడిగితే తెలివిగా సమాధానాలివ్వడం, పెదనాన్న స్వర్గీయ కృష్ణంరాజు గురించి చెప్తూ ఎమోషనల్ అయిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పటికీ ఫస్ట్ ఎపిసోడ్ ట్రెండ్ అవుతుంది.. ఇక జనవరి 6న స్ట్రీమింగ్ కానున్న ‘బాహుబలి ఎపిసోడ్ పార్ట్ -2’ ప్రోమో కూడా మొదటి భాగానికి మించి ఉండబోతుందనిపిస్తోంది.. అందులో పలు హీరోయిన్ల పేర్లు చెప్పి డార్లింగ్ నుండి నిజాలు రాబట్టే ప్రయత్నాలు చేసి విఫలమైన బాలయ్య బాబు రెండో భాగంలో ఎలా చెప్పిస్తారు..
ఏ్ం చెప్పిస్తారు? అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారనే విషయం తెలిసిందే.. నిజం బయటపడిపోతుందని ప్రభాస్, గోపిచంద్‌ని దబాయిస్తున్నాడంటూ స్టార్ట్ చేసిన బాలయ్య.. వార్నింగులు ఇవ్వొద్దమ్మా అనడం.. దానికి డార్లింగ్ తన స్టైల్లో మరి ఏ అమ్మా అని ఎందుకడిగారు అంటే బాలయ్య అబ్బా నాకే ట్విస్టా.. అనగా ప్రభాస్ పిల్లాడిలా అల్లరి చేస్తూ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ అయితే భలే ఉంది.. బాహుబలి తర్వాత ఎటు స్టెప్పెయ్యాలి..
ఆ టైంలో నీ మైండ్ సెట్ ఏంటి అనడగ్గా.. ప్రభాస్… ఇండియాలో అందరికీ నచ్చేలా ఏ సినిమా చెయ్యాాలి.. కష్టం ఎక్కువ పడ్డాం అంటూ బాహుబలి తర్వాత సినిమాల విషయంలో జరిగిన సంఘటనల గురించి చెప్పినట్టు చూపిస్తూ ప్రోమో ఎండ్ చేశారు.. ఈ పార్ట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..
బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!
ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?