టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో రెస్ట్ లేకుండా బిజీగా ఉన్నారు. ఏడాదికి రెండు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న ప్రభాస్ తన సినిమాలతో భారీ స్థాయిలోనే కలెక్షన్లను సాధిస్తూ ఫ్యాన్స్ కు మరింత దగ్గరవుతున్నారు. ప్రభాస్ తన సినిమా ప్రమోషన్స్ కు సైతం ప్రాధాన్యత ఇస్తే ఆ సినిమాల రేంజ్ మరింత పెరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ తల్లి పేరు శివకుమారి కాగా ఆమెకు ప్రభాస్ నటించిన అన్ని సినిమాలలో మిర్చి (Mirchi) సినిమా అంటే ఇష్టమట.
ఈ సినిమాలో ప్రభాస్ స్టైలిష్ గా కనిపించడంతో పాటు ప్రభాస్ లుక్స్ కూడా బాగుంటాయనే సంగతి తెలిసిందే. ఈ రీజన్స్ వల్లే ఆమెకు ఈ సినిమా ఎంతో నచ్చిందట. కొరటాల శివ (Koratala Siva) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు వచ్చాయనే సంగతి తెలిసిందే. మిర్చి సినిమా దర్శకుడు కొరటాల శివకు తొలి సినిమా కాగా ఈ సినిమా తర్వాత కొరటాల శివ కెరీర్ పరంగా వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.
మిర్చి తర్వాత ప్రభాస్ నటించిన బాహుబలి1 (Baahubali), బాహుబలి2 (Baahubali 2) సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయనే సంగతి తెలిసిందే. ప్రభాస్ కల్కి సినిమా విడుదలకు సరిగ్గా 50 రోజుల సమయం మాత్రమే ఉందని సమాచారం అందుతోంది. స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా కల్కి సినిమాకు సోలో రిలీజ్ డేట్ దక్కడంతో ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్లను అందుకుంటుందో చూడాల్సి ఉంది.
కల్కి సినిమా బిజినెస్ పరంగా కూడా అదరగొట్టిందని తెలుస్తోంది. ప్రభాస్ రాబోయే రోజుల్లో ఇతర భాషల్లో మార్కెట్ ను మరింత పెంచుకోవాల్సిన అవసరం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సినిమా సినిమాకు ప్రభాస్ క్రేజ్ ను పెంచుకుంటున్నారు.