యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో దుబాయ్ కి వెళ్లనున్నారు. అక్కడే రెండు నెలలపాటు గడపనున్నారు. బాహుబలి చిత్రం కోసం అక్కడికి ఎందుకు? అనుకుంటున్నారా!! ఆ చిత్రం కోసం కాదు. బాహుబలి కంక్లూజన్ తర్వాత చేయనున్న మూవీ కోసం దుబాయ్ కి పయనం కానున్నారు. “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న ఫిల్మ్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మించేందుకు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు సిద్ధమయ్యారు. యూవీ క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీలో ప్రభాస్ పోలీసాఫీసర్ పాత్ర పోషించనున్నారు.
ఎక్కువ భాగం దుబాయి, గల్ఫ్ దేశాల్లో చిత్రీకరించనున్నారు. ఇందుకోసం ప్రభాస్ తో పాటు చిత్ర యూనిట్ మొత్తం రెండు నెలలు అక్కడే ఉండనున్నారు. అక్కడి ఫైట్ సీక్వెన్స్ బాగా రావాలని హాలీవుడ్ నిపుణులను నియమించుకున్నారు. మిషన్ ఇంపాజిబుల్ వంటి అనేక హిట్ సినిమాలకు పనిచేసిన హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ తో యాక్షన్ సీన్స్ చిత్రీకరించేందుకు డిసైడ్ అయ్యారు. 150 కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోనున్న సినిమాలో ఐ బ్యూటీ అమీ జాక్సన్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ కాగా, మరో సుందరి కోసం గాలిస్తున్నారు. హిందీ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటించనున్న ఈ మూవీ ఈ నెల చివరి వారంలో పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది. 2017 జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.