మురుగదాస్, ప్రభాస్ కలయికలో మల్టీ లాంగ్వేజ్ మూవీ!
- September 1, 2017 / 07:36 AM ISTByFilmy Focus
కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయనున్నారా? వారిద్దరి కలయికలో మల్టీ లాంగ్వేజ్ మూవీ రాబోతోందా? అంటే అవుననే సమాధానమిస్తున్నారు ఫిల్మ్ నగర్ వాసులు. ప్రస్తుతం మురుగదాస్, మహేష్ బాబు తో స్పైడర్ మూవీ చేస్తున్నారు. దీనిని ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఈనెల 27 న రిలీజ్ కి ముస్తాబవుతోంది. ప్రభాస్ ప్రస్తుతం సుజీత్ దర్శకత్వంలో సాహో చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటోంది.
దీని తర్వాత ప్రభాస్ జిల్ ఫేమ్ రాధాకృష్ణతో మూవీ చేయడానికి సైన్ చేశారు. దాని తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఈ గ్యాప్ లో మురుగదాస్ విజయ్ తో సినిమా చేయనున్నారు. ఆ తర్వాత ప్రభాస్ ని హ్యాండిల్ చేయనున్నారు. అయితే ఇది ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కనున్నట్లు సమాచారం. ఈ మూడు భాషల్లో డైరక్టర్ మురుగదాస్, హీరో ప్రభాస్ కి మంచి డిమాండ్ ఉంది. సో ఆ రేంజ్ లో సినిమా రూపుదిద్దుకోనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















