Prabhas, Dasara: నాని దసరా సినిమాపై రివ్యూ ఇచ్చిన ప్రభాస్!

నాని తాజాగా నటించిన చిత్రం దసరా. మొదటిసారిగా నాని పాన్ ఇండియా స్థాయిలో నటించిన ఈ సినిమా మార్చి 30వ తేదీ విడుదల అయ్యి అన్ని భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్లను రాబడుతూ దూసుకుపోతుంది. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఇందులో నాని కీర్తి సురేష్ ఇద్దరు డి గ్లామర్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించారు.

ఇలా ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకోవడంతో చిత్ర బృందం మొత్తం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా చూసినటువంటి ఎంతోమంది సెలబ్రిటీలు పెద్ద ఎత్తున సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇదివరకే ఈ సినిమాపై మహేష్ బాబు స్పందిస్తూ తన రివ్యూ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. తాజాగా దసరా సినిమాపై పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ స్పందిస్తూ తన రివ్యూ ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రభాస్ (Prabhas) దసరా సినిమా గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఇప్పుడే తాను దసరా సినిమా చూశానని, ఇది ఒక అద్భుతమైన చిత్రం నాకు బాగా నచ్చింది. ఇలాంటి సినిమాలో నటించినందుకు ఈయన నానికి కంగ్రాట్స్ చెబుతూ సినిమాపై ప్రశంసలు కురిపించారు. నాని, కీర్తి సురేష్, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మొత్తం చిత్ర బృందం పనితీరు ఎంతో అద్భుతంగా ఉందని, మనం ఇలాంటి చిత్రాలను మరిన్ని చేయాలి అంటూ ప్రభాస్ ఈ సందర్భంగా దసరా సినిమాపై తన రివ్యూ ఇచ్చారు.

ఈ విధంగా మహేష్ బాబు ప్రభాస్ వంటి స్టార్ హీరోలు దసరా సినిమాకు ఈ విధమైనటువంటి రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమాకి మరింత ప్లస్ పాయింట్ అయిందని చెప్పాలి. ఇలా స్టార్ సెలబ్రిటీలు అద్భుతమైన రివ్యూ ఇవ్వడంతో ఈ సినిమాకు మరింత ఆదరణ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ గారి శిష్యుడు అనే విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా మంచి హిట్ అవడంతో డైరెక్టర్ శ్రీకాంత్ పై స్టార్ హీరోల దృష్టి పడిందనే చెప్పాలి.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus