Prabhas: మారుతి సినిమాలో ప్రభాస్ పాత్ర అలా ఉండనుందా.. మేకర్స్ అలా చూపిస్తారా?

ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ రెండు షేడ్స్ ఉన్న పాత్రలలో కనిపించనుండగా ఒక పాత్రలో ఓల్డ్ గెటప్ లో కనిపించనున్నారు. ప్రభాస్ ఓల్డ్ రోల్ కు ఒక వీక్ నెస్ ఉండేలా మారుతి ప్లాన్ చేశారని ఆ వీక్ నెస్ ప్రేక్షకులకు నవ్వు తెప్పించేలా ఉండనుందని తెలుస్తోంది.

స్టార్ హీరో ప్రభాస్ పారితోషికం 100 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా ప్రభాస్ (Prabhas) మారుతి కాంబో మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో విడుదల కానుంది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. ప్రభాస్ నటిస్తున్న సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకుంటూ ఉండటంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సలార్ రిలీజ్ డేట్ మారడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది.

సలార్ కొత్త రిలీజ్ డేట్ కు సంబంధించి ఎప్పుడు క్లారిటీ వస్తుందో చూడాల్సి ఉంది. సలార్ రిలీజ్ డేట్ మార్పు వల్ల ప్రాజెక్ట్ కే మూవీ రిలీజ్ కూడా ఆలస్యం కానుంది. ప్రాజెక్ట్ కే మూవీ 2024 సంవత్సరం సెకండాఫ్ లో రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ప్రభాస్ సినిమాలన్నీ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ లతో తెరకెక్కుతుండగా ఆ సినిమాలు ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తాయో చూడాల్సి ఉంది.

సలార్1 ఈ ఏడాదే రిలీజ్ కానుందని సలార్2 మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. 300 కోట్ల రూపాయల అత్యంత భారీ బడ్జెట్ తో సలార్1 మూవీ తెరకెక్కుతోంది. సలార్2 మూవీ సలార్1 ను మించి ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రభాస్ సినిమాలు ఎప్పుడు విడుదలైనా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తాయని ఫ్యాన్స్ ఫీలవుతుండగా ఈ సినిమాలు ఏ రేంజ్ లో మెప్పిస్తాయో చూడాల్సి ఉంది.

జవాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus