సాహోలో ప్రభాస్ పోషించే పాత్ర ఏమిటో తెలుసా !
- August 31, 2017 / 07:58 AM ISTByFilmy Focus
బాహుబలి తర్వాత యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సాహో సినిమా రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఏకకాలంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్ రోల్ ఏమిటని ఇప్పటివరకు సస్పెన్స్ గా ఉన్నింది. ఈరోజు ఆ విషయం బయటికి వచ్చింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను ప్రభాస్ పోషిస్తున్నట్లు తెలిసింది. తొలిసారి ఖాకీ డ్రస్సులో అదరగొట్టనున్నట్లు సమాచారం. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధ కపూర్ , విలన్స్ గా బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, నీల్ నితిన్ ముకేష్, చుంకే పాండే లు నటిస్తున్నారు.
కోలీవుడ్ నటుడు అరుణ్ విజయ్ కీలక రోల్ పోషించనున్నారు. ఈ సినిమాలో భారీ ఎత్తులో ఫైట్స్ మాత్రమే కాకుండా నీటి లోపల(అండర్ వాటర్ ఫైట్) కూడా యాక్షన్ సీన్స్ ఉన్నాయని డైరక్టర్ సుజీత్ చెప్పారు. రామోజీ ఫిలిం సిటీ లో దాదాపు 50 శాతం షూటింగ్ జరగనుందని, అనంతరం దుబాయ్ లోని ప్రఖ్యాత ప్రదేశాల్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















