Prabhas: సోషల్ మీడియాను రూల్ చేస్తున్న ప్రభాస్.. అక్కడ టాప్ లో నిలవడంతో?

స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఖాతాలో ఇప్పటికే ఎన్నో రికార్డులు ఉండగా ఆయన ఖాతాలో సరికొత్త రికార్డులు చేరుతున్నాయి. క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ విషయంలో ప్రభాస్ టాప్ లో ఉంటారనే సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ప్రభాస్ కు విదేశాల్లో సైతం అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన ఘనత చేరింది. వరుస ప్రాజెక్ట్ లతో కెరీర్ పరంగా బిజీగా ఉన్న ప్రభాస్ ఒక్కో సినిమా ఒక్కో జానర్ లో తెరకెక్కేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

రేర్ కాంబినేషన్స్ తో ప్రభాస్ అన్ని భాషల ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. తాజాగా ప్రభాస్ ఎక్స్ (ట్విట్టర్) టాప్ హ్యాష్ ట్యాగ్స్ ఆఫ్ ఇండియా జాబితాలో నిలిచిన ఏకైక హీరోగా అరుదైన రికార్డ్ ను సాధించారు. టాప్ 10 మోస్ట్ యూజ్డ్ హ్యాష్ ట్యాగ్స్ కు సంబంధించి ఎంటర్టైన్మెంట్ విభాగంలో ప్రభాస్ కు మాత్రమే చోటు దక్కింది.

ట్విట్టర్ ఇండియా విడుదల చేసిన ఈ జాబితాలో ప్రభాస్ పేరు ఉండటంతో రెబల్ స్టార్ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ప్రభాస్ ఖాతాలో ఇప్పటికే ఐదు సినిమాలు ఉండగా వచ్చే ఏడాది చివరి నాటికి అన్ని సినిమాలు విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంది. త్వరలో ప్రభాస్ మరిన్ని సినిమాలను ప్రకటించనున్నారని ఆ సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయని సమాచారం అందుతోంది.

ప్రభాస్ స్థాయిలో వేగంగా సినిమాలలో నటించడం చాలామంది హీరోలకు సాధ్యం కావడం లేదు. ప్రభాస్ సినిమాలకు 200 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోంది. టాక్ తో సంబంధం లేకుండా ప్రభాస్ సినిమాలు కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ప్రభాస్ రెమ్యునరేషన్ విషయంలో సైతం టాప్ లో ఉంటూ ఇతర స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు.

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus