Meera Chopra Wedding Photos: ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

మీరా చోప్రా (Meera Chopra) తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా, తమిళ దర్శకుడు ధరణి (Dharani) తెరకెక్కించిన ‘బంగారం’ (Bangaram) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ చిత్రంలో సంధ్య అనే అమ్మాయిగా ఈమె కనిపించింది. నిజానికి ఈ చిత్రంలో ఆమె హీరోయిన్ కాదు.. కానీ ఈమె పాత్ర చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. హీరో లక్ష్యానికి అడ్డుపడి, అతనికి బోలెడన్ని సమస్యలు తీసుకొచ్చే అమ్మాయిగా మీరాచోప్రా ఈ చిత్రంలో కనిపిస్తుంది. మాస్ జనాలకి ‘బంగారం’ కథ రుచించలేదు.

అందుకే ప్లాప్ అయ్యింది. దీంతో మీరా చోప్రాకి తెలుగులో అవకాశాలు ఎక్కువగా రాలేదు. ‘వాన’, (Maaro) ‘మారో’, (Greeku Veerudu) ‘గ్రీకు వీరుడు’ వంటి చిత్రాల్లో నటించినా అవి కూడా ఫ్లాప్ అవ్వడంతో ఆమె వెంటనే ఫేడ్ ఔట్ అయిపోయింది. ఇదిలా ఉండగా… సైలెంట్ గా మీరా చోప్రా పెళ్లి చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేసింది. ప్రియుడు రక్షిత్ తో ఈమె ఏడడుగులు వేసింది. చాలా కాలంగా అతనితో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించిన మీరా..

ఈరోజు పెద్దల సమక్షంలో అతన్ని పెళ్ళాడి ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది. రాజస్థాన్లో ఉన్న జైపూర్ లో ఈమె పెళ్లి బంధువులు, మిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది.మీరా చోప్రా తన పెళ్లి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇవి ప్రస్తుతం వైరల్ గా మారాయి. వీటికి బోలెడన్ని లైక్స్, షేర్స్ పడుతున్నాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు.

‘గామి’ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు!

స్టార్‌ హీరో అజిత్‌ హెల్త్‌ అప్‌డేట్‌ వచ్చేసింది… ఎలా ఉందంటే?
ఆ యూట్యూబ్ ఛానెల్స్ పై శరణ్య ప్రదీప్ ఫైర్.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus