Prabhas: టీజర్ పనుల్లో ఉంటే.. ఫొటోలు లీక్ చేశారు!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘సలార్’. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సింగరేణి బొగ్గుగనుల మాఫియా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. గతేడాది సెట్స్ పైకి వెళ్లిన ఈ సినిమా దాదాపు నలభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. మిగిలిన షూటింగ్ ను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలనుకుంటున్నారు.

Click Here To Watch NOW

ఇదిలా ఉండగా.. ‘సలార్’ సినిమా షూటింగ్ కి సంబంధించిన స్టిల్స్ లీక్ అయ్యాయి. ఇందులో ప్రభాస్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఫొటోలు లీక్ అవ్వడంతో అప్రమత్తమైన చిత్రబృందం ‘సలార్’ టీమ్ ఆ స్టిల్స్ అన్నింటినీ సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇంతకీ ఈ ఫొటోలు ఎలా లీక్ అయ్యాయా..? అని ఆరా తీయగా.. ‘సలార్’ టీజర్ కి ప్రచారం కల్పించడానికి..

టీజర్ కి సంబంధించిన కొన్ని స్టిల్స్ ను తీసి పక్కన పెట్టారట. వన్ డే టు గో.. 2 డేస్ టు గో.. అంటూ కౌంట్ డౌన్ ఇవ్వడం కోసం వాటిని సెలక్ట్ చేసి పెట్టుకున్నారు. అలా ఎంపిక చేసుకున్న స్టిల్స్ ని సోషల్ మీడియాలో లీక్ చేశారు. ఇక టీజర్ విషయానికొస్తే.. ‘కేజీఎఫ్ ఛాప్టర్-2తో’ ‘సలార్’ టీజర్ ను విడుదల చేయాలనుకున్నారు. కానీ దానికి ప్రభాస్ ఒప్పుకోలేదని టాక్. ఇప్పుడు మే నెలాఖరున టీజర్ విడుదల చేయబోతున్నారని సమాచారం.

టీజర్ కోసం పనులు చేస్తోన్న సమయంలో ఫొటోలు లీక్ అయి.. యూనిట్ ను ఇబ్బంది పెడుతోంది. ఈ ఫొటోలు పోస్ట్ చేసిన వందలాది ట్విట్టర్ అకౌంట్స్ ను సస్పెండ్ చేశారు.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus