ప్రభాస్ షాకింగ్ లుక్!

‘సాహో’ సినిమా తరువాత ప్రభాస్ తన తదుపరి సినిమా ‘రాధేశ్యామ్’ని పూర్తి చేసే పనిలో పడ్డాడు. ఈ సినిమా తరువాత దర్శకుడు ఓం రౌత్, అలానే నాగ్ అశ్విన్ లతో సినిమాలు చేయనున్నాడు ప్రభాస్. ఇదిలా ఉండగా.. తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో ప్రభాస్ ఇదివరకటి కంటే కాస్త భిన్నంగా కనిపిస్తున్నాడు. ‘బాహుబలి’, ‘సాహో’ సినిమాలలో కనిపించిన మాదిరి ప్రభాస్ లేడు.

తన శరీర బరువుని పూర్తిగా తగ్గించుకున్నాడు. శరీర కండలు పూర్తిగా కరిగిపోయాయి. అయితే ఈ లుక్ లో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడని అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. దీంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ‘రాధేశ్యామ్’ కోసం బరువు తగ్గాడా..? లేక మిగిలిన సినిమాల్లో కూడా ఇదే లుక్ తో కనిపిస్తాడా..? అనే విషయంలో క్లారిటీ లేదు. ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది.

ఈ సినిమాకి సంబంధించి చివరి షెడ్యూల్ హైదరాబాద్ నగరంలో ఓ ఫిల్మ్ స్టూడియోలో ఏర్పాటు చేసిన భారీ సెట్ లో జరుగుతోంది. త్వరలోనే హీరోయిన్ పూజా హెగ్డే ఈ షూటింగ్ లో పాల్గొనుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ సన్నివేశాల కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ ని రంగంలోకి దింపుతున్నారు.

1

2

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus