యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినీ కెరీర్ లో బహుబలి చాలా మార్పులు తీసుకొచ్చింది. ఇప్పటివరకు తెలుగు ప్రజలకే పరిమితమైన డార్లింగ్ భారతీయుల హీరో అయిపోయారు. దీంతో అతని నెక్స్ట్ సినిమా మార్కెట్ విస్తరించింది. ఇప్పుడు చిత్రీకరణ చివరి దశలో ఉన్న బాహుబలి కంక్లూజన్ మాత్రమే కాకుండా.. ఆ తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమాలు కూడా అనేక భాషల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న ఫిల్మ్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మించేందుకు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు సిద్ధమయ్యారు.
యూవీ క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీని హాలీవుడ్ చిత్రాలు మిషన్ ఇంపాజిబుల్, ది బర్న్ ఐడెంటిటీ స్ఫూర్తి తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. వాటిలో ఉండే యాక్షన్ సన్నివేశాలను ప్రభాస్ మూవీలో చూడడనున్నాం. అందుకే హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ని తీసుకున్నట్లు తెలిసింది. అంతేకాదు బాహుబలి చిత్రానికి రాజమౌళి పాటించిన సూత్రాన్నే సుజీత్ పాటిస్తున్నారు. సినిమా ప్రారంభం కాకముందే తమిళ్, హిందీ రచయితలతో మాటలు రాయిస్తున్నారు. ప్రీ ప్రొడక్ష దశలోనే ఈ జాగ్రత్తలు పాటించడం వల్ల ప్రొడక్షన్ దశలో సులువుగా ఉంటుందని, ఔట్ పుట్ బాగా వస్తుందని సుజీత్ నమ్ముతున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.