బహుబలి చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి ఎనలేని క్రేజ్ వచ్చింది. పొరుగు రాష్ట్రాల్లోనూ డార్లింగ్ ని అభిమానించే వారి సంఖ్య పెరిగింది. దీంతో అతని నెక్స్ట్ సినిమా మార్కెట్ విస్తరించింది. ఇప్పుడు చిత్రీకరణ చివరి దశలో ఉన్న బాహుబలి కంక్లూజన్ మాత్రమే కాకుండా.. ఆ తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమాలు కూడా అనేక భాషల్లో విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేయనున్న ఫిల్మ్ ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మించేందుకు నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు సిద్ధమయ్యారు.
తమ యూవీ క్రియేషన్ బ్యానర్లో తెరకెక్కనున్న ప్రభాస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం 100 కోట్ల బడ్జెట్ కేటాయించారు. దుబాయ్ నేపథ్యంలో సాగే ఈ మూవీలో డార్లింగ్ తో ఇద్దరు ముద్దు గుమ్మలు రొమాన్స్ చేయనున్నారు. ఇందులో ఒక నటిగా ఎమీ జాక్సన్ ఎంపిక ఖరారు అయింది. మరో తార కోసం సుజీత్ అన్వేషిస్తున్నారు. డిసెంబర్ 10 న పూజా కార్యక్రమాలు జరుపుకోనున్న ఈ సినిమా, 2017 జనవరి మొదటి వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ లోకి అడుగు పెట్టనుంది.