ప్రభాస్ వీరోచితంగా నటించిన బాహుబలి కంక్లూజన్ తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ ఎక్కువగా వసూళ్లు సాధించింది. హిందీ సినిమాల రికార్డులను సైతం బాహుబలి 2 తుడిచిపెట్టింది. అందుకే అక్కడి నిర్మాతలు ప్రభాస్ తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేశారు. భారీ రెమ్యునరేషన్ అఫర్ చేశారు. అయితే బాహుబలి చిత్రానికి ప్రభాస్ ఇచ్చిన మాట ప్రకారం సుజీత్ తోనే ప్రభాస్ సినిమా చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది.
దీని తర్వాత రాధా కృష్ణ డైరెక్షన్లో ఓ మూవీ చేయనున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత స్ట్రయిట్ హిందీ సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గురించి అధికారిక ప్రకటన త్వరలో రానుంది. అప్పుడే డైరక్టర్, నిర్మాత, ఇతర టెక్నీషియన్, ఆర్టిస్టుల వివరాలు వెల్లడించనున్నారు.