Prabhas, Sreeleela: ప్రభాస్ శ్రీలీల కాంబో విషయంలో ఫ్యాన్స్ భయానికి కారణాలివే!

  • January 29, 2024 / 04:28 PM IST

ప్రభాస్ శ్రీలీల కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిందని హను రాఘవపూడి ఈ సినిమాకు దర్శకుడు అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. వార్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని తాజాగా శ్రీలీలకు లుక్ టెస్ట్ కూడా జరిగిందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రభాస్ శ్రీలీల కాంబినేషన్ లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కలేదనే సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ కొత్తగా ఉంటుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

అయితే అదే సమయంలో ఈ మధ్య కాలంలో శ్రీలీల ట్రాక్ రికార్డ్ కూడా ఏమంత అద్భుతంగా లేదు. భగవంత్ కేసరి, గుంటూరు కారం సక్సెస్ సాధించినా మిగతా సినిమాలు ఆమె కెరీర్ కు మైనస్ అయ్యాయి. స్కంద, ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ డిజాస్టర్లుగా నిలవగా ఈ మూడు సినిమాలలో శ్రీలీల పాత్రకు సైతం చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రాధాన్యత లేదనే సంగతి తెలిసిందే. శ్రీలీల రోల్స్ ఈ సినిమాలకు మైనస్ అయ్యాయి.

ప్రభాస్ శ్రీలీల కాంబినేషన్ విషయంలో ఫ్యాన్స్ భయానికి కారణాలు ఇవే కాగా త్వరలో ఈ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన రానుంది. ప్రభాస్ వరుసగా కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒకే సమయంలో రెండు లేదా మూడు సినిమాలలో నటిస్తున్నారు. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలతో సలార్ ను మించిన సక్సెస్ ను సొంతం చేసుకుంటానని బలంగా నమ్ముతున్నారు.

ప్రభాస్ కెరీర్ ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కేలా ప్రభాస్ అడుగులు పడుతున్నాయని సమాచారం అందుతోంది. ప్రభాస్ ఒకవైపు ఊరమాస్ కథలకు ఓటు వేస్తూనే మరోవైపు క్లాస్ కథలలో నటిస్తూ కెరీర్ పరంగా సత్తా చాటుతున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే దిశగా ప్రభాస్ అడుగులు పడుతున్నాయి. ప్రభాస్ (Prabhas) క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus