యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మోడ్రన్ కార్లలో షికారు చేయనున్నాడు. కొన్ని రోజుల క్రితమే కదా డార్లింగ్ అత్యంత ఖరీదైన రోల్స్ రాయిస్ కారుని కొన్నాడు, అందులో షికారు చేయడం కూడా వార్తేనా ? అని అనుకుంటున్నారా ? ఇది రియల్ లైఫ్ గురించి కాదండీ… రీల్ లైఫ్ గురించి. ప్రస్తుతం ‘బాహుబలి- కంక్లూజన్’ షూటింగ్ బిజీలో ఉన్న ప్రభాస్.. ఈ సినిమా అయిపోయిన వెంటనే నయా లుక్ లో కనిపించనున్నాడు. బాహుబలి కోసం జుట్టు, కండలు పెంచిన డార్లింగ్ తర్వాతి సినిమా కోసం పూర్తిగా మారిపోనున్నాడు.
‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ నటించనున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మించనున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన సంగతి బయటికి వచ్చింది. ఇందులో ప్రభాస్ ఖరీదైన మోడరన్ కార్లను ఉపయోగిస్తారని తెలిసింది. రెబల్ స్టార్ కి పెరిగిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రానికి అనేక హంగులను జోడిస్తున్నారు. అందులో భాగమే ఈ లేటెస్ట్ మోడల్ కార్లు. ఇదివరకు ఏ చిత్రాల్లో ఇటువంటి కార్లను చూసి ఉండరని సమాచారం. బాహుబలి -2 చిత్రీకరణ పూర్తి అయినా తర్వాత రెండు నెలలు గ్యాప్ తీసుకొని బరువు తగ్గి సుజీత్ డైరక్షన్ లో డార్లింగ్ నటించనున్నాడు.