సుమ కుమారుడు రోషన్ కనకాల హీరోగా ‘బబుల్ గమ్’ తర్వాత రూపొందిన రెండో సినిమా ‘మోగ్లీ’. 2020 లో వచ్చిన ఓటీటీ హిట్ ‘కలర్ ఫోటో’ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన సినిమా ఇది. బండి సరోజ్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తుండటం ఆసక్తికర అంశం.
‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. టీజర్ కానీ, ట్రైలర్ కానీ సినిమాపై ఎటువంటి బజ్ ను క్రియేట్ చేయలేదు. కానీ ‘అఖండ 2’ వల్ల వాయిదా పడే ప్రమాదంలో పడినప్పుడు దర్శకుడు సందీప్ రాజ్ చేసిన ఎమోషనల్ ట్వీట్ పబ్లిసిటీ అయ్యేలా చేసింది.
ఆ విషయాలు పక్కన పెట్టేసి ‘మోగ్లీ’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
| నైజాం | 1.5 cr |
| సీడెడ్ | 0.30 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.2 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 3 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.20 cr |
| ఓవర్సీస్ | 0.30 cr |
| టోటల్ వరల్డ్ వైడ్ | 3.5 కోట్లు(షేర్) |
‘మోగ్లీ'(Mowgli) చిత్రానికి రూ.3.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.4 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ‘అఖండ 2’ వంటి పెద్ద సినిమా మేనియాలో ఈ సినిమా ఎంత వరకు నిలదొక్కుకుంటుందో? బ్రేక్ ఈవెన్ సాధిస్తుందో లేదో చూడాలి.టికెట్ రేట్లు తక్కువగా పెట్టడం, బండి సరోజ్ కి ఉన్న మాస్ ఫాలోయింగ్ వంటివి ‘మోగ్లీ’ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ కి కొంచెం కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి.