Akhanda 2 Review in Telugu: అఖండ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • నందమూరి బాలకృష్ణ (Hero)
  • సంయుక్త మీనన్ (Heroine)
  • ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా, కబీర్ దుహాన్ సింగ్, పూర్ణ తదితరులు (Cast)
  • బోయపాటి శ్రీను (Director)
  • రామ్ ఆచంట - గోపి ఆచంట - ఇషాన్ సక్సేనా (Producer)
  • తమన్ (Music)
  • సి.రాంప్రసాద్ - సంతోష్ (Cinematography)
  • తమ్మిరాజు (Editor)
  • Release Date : డిసెంబర్ 12, 2025
  • 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్ - IVY ఎంటర్టైన్మెంట్ (Banner)

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన నాలుగో చిత్రం “అఖండ 2” (Akhanda 2). అఖండ కి ప్రాపర్ సీక్వెల్ గా విడుదలైన ఈ చిత్రం వాయిదాపడడం అనేది మంచి పబ్లిసిటీ ఇచ్చింది. మరి బాలయ్య-బోయపాటి కాంబో నాలుగోసారి ఆకట్టుకోగలిగారా? లేదా? అనేది చూద్దాం..!!

Akhanda 2 Thaandavam Movie Review

కథ: ఇండియా-చైనా మధ్య బోర్డర్ వార్ అనేది పతాక స్థాయికి చేరుకుని, శత్రుదేశం ఏకంగా భారతదేశ మూలాలను నాశనం చేసేందుకు పూనుకుంటుంది. ఆ మానవ ప్రేరేపిత ప్రళయం నుండి భారతదేశాన్ని, సనాతన ధర్మాన్ని, ప్రజల్ని అఖండ (బాలకృష్ణ) ఎలా కాపాడాడు? అనేది “అఖండ 2” కథాంశం.

నటీనటుల పనితీరు: బాలయ్య (Balakrishna) పోషించిన రెండు క్యారెక్టర్స్ లో అఖండ సింహభాగం తీసుకోగా.. ఎమ్మెలే బాలమురళి కృష్ణ అనే క్యారెక్టర్ మాత్రం సరిగ్గా వర్కవుట్ అవ్వలేదు. అయితే.. అఖండగా మాత్రం బాలయ్య స్క్రీన్ ప్రెజన్స్, డైలాగ్ డెలివరీ, యాక్షన్ బ్లాక్ ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా సనాతనధర్మం గురించి, దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ బాగా కనెక్ట్ అవుతాయి.

సంయుక్త మీనన్ పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ.. ఎందుకో ఆమె ఈ సినిమాలో కానీ, ఉన్న ఒక్క పాటలో కానీ ఇమడలేకపోయింది. ఆ పాట కూడా సినిమాలో ఇమడలేకపోయిందనుకొండి.

సినిమాలో విలన్ ఉన్నాడు అన్న పేరుకే కానీ.. ఆది పినిశెట్టి సినిమా ఉన్నాడు అనే విషయం సెకండాఫ్ లో సడన్ గా కనిపించేంతవరకు తెలియలేదు. పాపం రెండు ఫైట్ల తర్వాత అతడి పాత్రను ముగించేయడం వల్ల సినిమాలో అతను విలన్ అనే భావన ఇవ్వలేకపోయింది.

“భజరంగీ భాయిజాన్” ఫేమ్ హర్షాలి లిప్ సింక్ ఇవ్వడానికి ఏమాత్రం ప్రయత్నించకుండా హిందీలో లేదా నెంబర్లు లెక్కపెట్టుకుంటూ వెళ్లిపోవడం అనేది మైనస్ గా మారింది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నప్పటికీ.. డబ్బింగ్ వాయిస్ సెట్ అవ్వక, లిప్ సింక్ లేక ఓ బార్బీ బొమ్మలా మిన్నకుండిపోయింది.

మురళీమోహన్, కబీర్ దుహాన్ సింగ్, శాశ్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక దేశాలు దాటిన విలనిజం కూడా ఎందుకో సరిగా వర్కవుట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: అఖండ మొదటి భాగానికి తన సంగీతంతో ప్లస్ పాయింట్ గా నిలిచిన తమన్ సెకండ్ పార్ట్ కి అదే స్థాయిలో న్యాయం చేయలేకపోయాడు. ట్రాన్స్ బీజీయం బాగున్నా.. కొన్ని సన్నివేశాలకు ఆర్.ఆర్ రిపీట్ అయిపోయింది. ఇంకొన్ని థీమ్స్ రెడీ చేసి ఉంటే బాగుండేది.

రామ్-లక్ష్మణ్ మాస్టర్లు కంపోజ్ చేసిన యాక్షన్ బ్లాక్ ను విడిగా చూస్తే కచ్చితంగా ట్రోల్ చేస్తారు. అయితే.. సినిమా తాలూకు ఎమోషన్ లో మాత్రం మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్, సెకండాఫ్ లో వచ్చే ఓ రెండు ఫైట్లు గూస్ బంప్స్ అని చెప్పొచ్చు.

బాలయ్య కంఫర్ట్ సినిమాటోగ్రాఫర్ రాంప్రసాద్ ఎప్పట్లానే బాలయ్యని బాగా చూపించారు. ఫైట్ సీన్స్ ను బాగా మ్యానేజ్ చేసారు.

దర్శకుడు బోయపాటి సినిమాల్లో మామూలుగానే ఫైట్ సీన్స్ లో లాజిక్స్, యాక్షన్ లో సెన్సిబిలిటీస్ కనిపించవు. ఇక ఈ సినిమాలో హీరో దాదాపుగా దేవుడు లాంటోడు కావడంతో బోయపాటి క్రియేటివిటీకి అడ్డు లేకుండాపోయింది. అయితే.. శివుడు, హనుమంతుడు వంటి డివోషనల్ ఎలిమెంట్స్ ను సినిమా కోసం వినియోగించుకున్న విధానం బాగుంది. కాకపోతే.. అఖండ 2లో ఒక కోర్ పాయింట్ & స్ట్రాంగ్ విలన్ లేకపోవడం వల్ల యాక్షన్ సీన్స్ మినహా మిగతా సినిమాని మొదటి భాగం స్థాయిలో ఆస్వాదించలేకపోయాం.

కామెడీ సీన్స్ విషయంలో బోయపాటి వీక్ అనేది ఈ సినిమాలో కామెడీ సీన్స్ & పంచులు మరోసారి ప్రూవ్ చేస్తాయి. అయితే.. ఆడియన్స్ కు ఇవన్నీ ఆలోచించే టైమ్ ఇవ్వకుండా.. వరుసబెట్టి ఎలివేషన్స్, ఫైట్స్ తో సినిమాని హరి రేంజ్ లో పరిగెట్టించి ప్రేక్షకులు పెద్దగా బోర్ ఫీలవ్వకుండా చేయగలిగాడు బోయపాటి. అందువల్ల “అఖండ 2” బోయపాటి బెస్ట్ వర్క్ అని చెప్పలేం కానీ.. దర్శకుడిగా, కథకుడిగా ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయగలిగాడు అనైతే చెప్పొచ్చు.

విశ్లేషణ: కొన్ని కాంబినేషన్లకి, సినిమాలకి కథ-కథనం-ఎమోషన్ తో సంబంధం ఉండదు. అలాంటి రేర్ కాంబో బాలయ్య-బోయపాటి. పైన పేర్కొన్నట్లు లాజికల్ గా చూసి జడ్జ్ చేసే సినిమా కాదు ఇది, బుర్రలో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా.. ఓ రెండున్నర గంటలపాటు బాలయ్య విధ్వంసం ఎంజాయ్ చేయాల్సిందే. ఆ యాక్షన్ సీన్స్ అన్నీ ఓటీటీ రిలీజ్ తర్వాత మంచి ట్రోల్ మెటీరియల్ అవుతాయి. అయితే.. వాటికి మించి సినిమా ఎండ్ క్రెడిట్స్ లో వచ్చే మేకింగ్ వీడియో ఆడియన్స్ కి మంచి రిలీఫ్ ఇస్తుంది. ప్రతి ఒక్క సన్నివేశాని బోయపాటి చేసి చూపించే విధానం ప్రేక్షకుల ముఖాన నవ్వు పండిస్తుంది.

కాకపోతే.. మరీ కూరలో జీడిపప్పు వేయడం కూడా చేసి చూపించాలా అని అనిపించడం మాత్రం ఖాయం. ఓవరాల్ గా.. లాజిక్స్ పట్టించుకోకుండా బాలయ్య రేంజ్ ఫైట్స్, బోయపాటి మార్క్ మాస్ ఎలివేషన్స్, తమన్ ట్రాన్స్ & రామ్-లక్ష్మణ్ ల క్రేజీ యాక్షన్ బ్లాక్ కోసం “అఖండ 2” (Akhanda 2) థియేటర్లలో ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందే. ఇంకో విశేషం ఏమిటంటే.. బాలయ్య ఫ్యాన్ గా సినిమా చూస్తే.. దొమ్మలదిరేలా ఎంజాయ్ చేస్తే, ఓ సాధారణ ప్రేక్షకుడిగా సినిమా చూస్తే అక్కడక్కడా ఇదెక్కడి మాస్ రా అని నోరెళ్లబెడుతూ సినిమాలో లీనమైపోతారు జనాలు.

ఫోకస్ పాయింట్: బాలయ్య మాసులందు.. బోయ మాసు వేరయ్యా!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus