Prabhas: రాజ్ కుమార్ హిరాని డార్లింగ్ కోసం కథ రెడీ చేసేశాడట

  • November 10, 2022 / 02:10 PM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులు సెట్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ సాహో, రాధే శ్యామ్ వచ్చాయి.. వాటి ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. అయితే వాటి ఫలితాల వల్ల ప్రభాస్ ఇమేజ్ కు వచ్చిన ఇబ్బంది లేదు. ప్రభాస్ క్రేజ్ అలాగే ఉంది. అయితే ప్రభాస్ సెట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు ఏమీ ఆకర్షించే విధంగా లేవు. ఒక్క సలార్ తప్ప ఆదిపురుష్,

ప్రాజెక్ట్ కే అలాగే మారుతి దర్శకత్వంలో చేస్తున్న మూవీ… ఇలాంటి వాటిపై జనాల్లో ఆసక్తి లేదు. ఇటీవల వచ్చిన ఆదిపురుష్ టీజర్ ఎంత నాసిరకంగా ఉందో చూశాం. బాహుబలి హీరో ఏంటి ఇలా అయిపోయాడు అని జాలిపడేలా ఆ టీజర్ ఉంది.అయితే ప్రభాస్ కోసం ఓ స్టార్ డైరెక్టర్ కథని రెడీ చేస్తున్నాడట. ఇతను మినిమం గ్యారెంటీ డైరెక్టర్ అనే పేరుని కూడా సంపాదించుకున్నాడు. ఇతనితో సినిమా చేయాలని ఉంది.

అది నా డ్రీమ్ అంటూ ప్రభాస్ కూడా చెప్పుకొచ్చాడు. ఆ దర్శకుడు మరెవరో కాదు రాజ్ కుమార్ హిరానీ. బాలీవుడ్ దర్శకుడే అయినప్పటికీ ఇతని సినిమాల్లో యూనివర్సల్ అప్పీల్ ఉంటుంది. ఇలాంటి దర్శకుడితో కనుక ప్రభాస్ సినిమా చేస్తే కచ్చితంగా పాన్ వరల్డ్ స్థాయిలో సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం అందరిలోనూ ఉంది.

ప్రభాస్ కు ఇండియాలోనే కాకుండా చైనా, జపాన్ వంటి దేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక రాజ్ కుమార్ హిరానీ సినిమాలకు కూడా అక్కడ భారీ క్రేజ్ ఉంది. ఈ కాంబినేషన్లో కనుక సినిమా పడితే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురవడం గ్యారెంటీ అనే చెప్పాలి.

ఊర్వశివో రాక్షశివో సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
శిల్పా శెట్టి టు హన్సిక.. వ్యాపారవేత్తలను పెళ్లి చేసుకున్న హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus