ప్రభాస్, సుజీత్ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఎప్పుడంటే ?
- March 18, 2017 / 01:27 PM ISTByFilmy Focus
అందరూ బాహుబలి ఫీవర్ లో ఉంటే ప్రభాస్ మాత్రం తన తర్వాతి సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ చేయనున్న చిత్రం పనుల్లో వేగం పుంజుకుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మించనున్న ఈ మూవీ కొన్ని రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ చిత్రానికి ఆర్టిస్టులు, టెక్నీషియన్లను డైరక్టర్ ఫిక్స్ చేశారు. ప్రభాస్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం లో విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ నటించనున్నారు.
సినిమాటోగ్రాఫర్ గా మధిని, మ్యూజిక్ డైరక్టర్ గా బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ – ఇషాన్ – లాయ్ లను తీసుకున్నారు. హాలీవుడ్ ఫైట్ మాస్టర్ కెన్నీ బేట్స్ కూడా ప్రభాస్ 19 కోసం శ్రమించనున్నారు. ఇన్ని ప్రత్యేకతలు కలిగిన ఈ సినిమా గురించి ఆసక్తికర వార్త బయటికి వచ్చింది. ఈనెల చివరి నుంచే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ వచ్చేనెల 15 తేదీ వరకు కొనసాగనుంది. కొన్ని యాక్షన్ సీన్స్ షూట్ చేసి టీజర్ రూపంలో బాహుబలి 2 ప్రదర్శితమయ్యే అన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















