ఆకట్టుకుంటున్న సాహోలో ప్రభాస్ లుక్!
- July 18, 2017 / 06:01 AM ISTByFilmy Focus
బాహుబలి కంక్లూజన్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న సాహో సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలను టీజర్ పెంచింది. ఇప్పుడు అందులోని ప్రభాస్ లుక్ బయటికి వచ్చింది. రింగు తిరిగిన జుత్తు, చిరు గెడ్డంతో ప్రభాస్ ఆకట్టుకుంటున్నారు. నిన్ని రిలీజ్ అయిన ఈ లుక్ చూసి అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. యువ డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి అయింది. సిటీ సెంట్రల్ లైబ్రరీలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ పై కొన్ని షాట్స్ తెరకెక్కించారు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై 150 కోట్లతో ఏక కాలంలో మూడు భాషల్లో వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ ని ముంబై లో ప్రారంభించనున్నారు. గత నెల రోజులుగా అక్కడే ఉన్న ప్రభాస్ ముంబయిలో ప్రముఖ స్టైలిస్ట్ ఆధ్వర్యంలో తనని తాను కొత్తగా తీర్చిదిద్దుకున్నారు. ఆ లుక్ ని నిన్న రిలీజ్ చేశారు. ఇది సాహోలో లుక్ అని చిత్ర బృందం ప్రకటించకపోయినప్పటికీ .. అందరూ సాహో లుక్ అని ఫిక్స్ అయిపోయారు. ఈ నెల చివరి వారంలో సాహో షూటింగ్ లో ప్రభాస్ పాల్గొననున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















