రెబల్ స్టార్ కృష్ణంరాజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలత్తడంతో అతన్నిసోమవారం బంజారాహిల్స్ లోని కేర్ హాస్పిటల్ల్లో అడ్మిట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం ప్రమాదం లేదని, అబ్జర్వ్ కోసం హాస్పిటల్లో ఉంచినట్లు వైద్యులు స్పష్టం చేశారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఆస్పత్రికి వచ్చి కృష్ణంరాజు తో రెండు గంటల పాటు గడిపారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగుందని కృష్ణంరాజు చెప్పడంతో అక్కడ నుంచి వెళ్ళినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.