చిరు కోసం ప్రభుదేవా!
- August 10, 2016 / 04:55 AM ISTByFilmy Focus
కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టి డైరెక్టర్ గా, యాక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న నటుడు ప్రభుదేవా. తెలుగులో చాలా చిత్రాలకు ప్రభుదేవా తన కొరియోగ్రఫీ అందించాడు. చిరు నటించిన చాలా చిత్రాలకు ప్రభుదేవానే కొరియోగ్రఫీ చేసేవాడు. అందుకే ప్రభుదేవా అంటే చిరుకి అభిమానం, గౌరవం. ఇప్పటికే చిరంజీవి 150వ సినిమాలో ఒక పాట కోసం లారెన్స్ ను కొరియోగ్రఫీ చేయమని అడిగారు.
అలానే ఇప్పుడు మరో పాట కోసం ప్రభుదేవాను సంప్రదించారట. ప్రస్తుతం ప్రభుదేవా తన సినిమాలకు తప్ప బయట సినిమాలకు కొరియోగ్రఫీ చేయట్లేదు. కానీ చిరంజీవి సినిమా గనుక కాదనకుండా ఒప్పుకున్నట్లు సమాచారం. చిరు పట్టు బట్టి మరీ ప్రభుదేవా ఉండాల్సిందేనని చెప్పారట. అందుకే ఇక టీం కూడా ప్రభుదేవాపై ఆసక్తి చూపారు. ప్రస్తుతం ఈ డాన్స్ మాస్టర్ పాటకు డాన్స్ కంపోజ్ చేసే పనిలో ఉన్నాడని అంటున్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















